ఏపీ రాజకీయాలు వేడి వేడిగా నడుస్తున్న తరుణంలో రాష్ట్రం పట్ల, రాష్ట్ర నాయకుల పట్ల మోదీ, అమిత్ షా వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయనేది సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇప్పటివరకు ఒకరికి వైసీపీకి అనుకూలంగా ఉంటూ వస్తోంది కేంద్రం. బయటకి చెప్పుకున్నా తెరవెనుక వనగూర్చాల్సిన ప్రయోజనాలను వనగూరుస్తూనే ఉంది. జగన్ సైతం కేంద్రం మద్దతు తనకు ఎంత అవసరమో గుర్తెరిగి నడుచుకుంటున్నారు. రాజ్యసభలో ఏ బిల్లు పెట్టినా మారు మాట్లాడకుండా బీజేపీని సమర్థిస్తూ ఓటు వేస్తున్నారు. బీజేపీ కూడ రాజ్యసభలో తనకు మెజారిటీ లేకపోవడంతో 6గురు సభ్యుల బలమున్న వైసీపీని అక్కున చేర్చుకుంటున్నారు. అందుకే రాష్ట్రంలో జగన్ ఏం చేసినా నడుస్తోందని అంటున్నారు.
అయితే రాబోయే నవంబర్ నెలలో పరిస్థితులు మారిపోతాయని అంటున్నారు విశ్లేషకులు. అందుకు కారణం ఖాళీగా ఉన్న 11 రాజ్యసభ సీట్లకు ఎన్నికలు జరగనుండటం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 10, ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఒక రాజ్యసభ సీటు త్వరలోనే వేకెంట్ అవుతాయి. వాటికే నవంబర్ 9న ఎన్నికలు జరుగుతాయి. యూపీలో బీజీపీ చాలా బలంగా ఉంది. అక్కడ వారికి 306 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాబట్టి 10కి 10 రాజ్యసభ స్థానాలు బీజేపీ ఖాతాలో పడిపోతాయి. ఇక ఉత్తరాఖండ్ నందు కూడ బీజేపీ బలంగానే ఉంది కాబట్టి ఆ స్థానం కూడ వారికే దక్కే అవకాశం ఉంది. సో.. 11 సీట్లలో 11 లేదా 10 బీజేపీకి సొంతమవడం తథ్యం. అప్పుడు రాజ్యసభలో 86గా ఉన్న బీజేపీ బలం 97 లేదా 96 కు పెరుగుతుంది. ఇది పెద్ద పెరుగుదలే.
పైగా తమిళనాడులో అన్నాడీఎంకే బీజేపీకి అనుకూల వైఖరిని ప్రదరిస్తూనే ఉంది. కాబట్టి వారి రాజ్యసభ నెంబర్ కూడ బీజేపీకి కలిసొచ్చే వీలుంది. అప్పుడు మోడీకి 6గురు సభ్యులున్న జగన్ అవసరం దాదాపుగా ఉండకపోవచ్చు. అప్పుడు చీటికీ మాటికీ జగన్‌కు ఫెవర్ చేయాల్సిన పని మోదీకి ఉండదు. అప్పుడు జగన్ ఒంటరి అయిపోతారని, వాటికి తోడు కోర్టుల్లో ప్రజాప్రతినిధుల కేసుల విచారణ ఊపందుకుంటోంది కాబట్టి జగన్ చిక్కుల్లో పడవచ్చని, వాటి నుండి కాపాడగలిగిన మోదీ మీ అవసరం మాకు లేదని హ్యాండిస్తే పరిస్థితి ఏమిటని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరి వారంటున్నట్టు నిజంగానే మోదీ తనకు సొంత మెజారిటీ వస్తే జగన్‌ను పక్కనపెట్టేస్తారా లేకపోతే మునుపటి స్నేహమే కంటిన్యూ చేస్తారా అనేది చూడాలి.