మోదీ మనసులో ఆ ఆలోచనే ఉంటే విజయసాయిరెడ్డి లెవల్ మారిపోవడం ఖాయం

విజయసాయిరెడ్డి.. వైసీపీలో నెంబర్ 2గా దూసుకుపోతున్నారు.  రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి తర్వాత అంతా ఆయనే అన్నట్టు ఉంటుంది వైసీపీలో వాతావరణం.  జగన్ తర్వాత వైసీపీ నేతలు అంతలా ఫాలో అయ్యేది విజయసాయిరెడ్డినే.  ఇక ఢిల్లీ లెవల్లో అయితే ఆయన హవాకు అడ్డే లేదు.  వైసీపీ తరపున పార్లమెంటరీ నేతగా, రాజ్యసభలో వైసీపీపక్ష నేతగా ఉన్న ఆయన్ను ఈమధ్యే ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా నియమించారు జగన్.  అంటే 22 మంది ఎంపీలు, 6గురు రాజ్యసభ సభ్యులు ఉన్న బలమైన పార్టీ అయినటువంటి వైసీపీకి ఢిల్లీలో ఫేస్ వినయసాయిరెడ్డే.  ఆయన కనుసన్నల్లోనే పార్టీ ఢిల్లీ కార్యకలాపాలు జరుగుతున్నాయి. 

Modi to offer key Post to Vijayasaireddy
Modi to offer key Post to Vijayasaireddy

ఇవన్నీ ఒక ఎత్తైతే ఢిల్లీ స్థాయిలో ఆయన్ను ఇంకో పెద్ద పదవి వరించనుందనే ప్రచారం జరుగుతోంది.  అదే కేంద్ర మంత్రి పదవి.  అవును.. మోదీ, అమిత్ షాల మనసులో ఇదే అలోచన ఉందట.  పేరుకు అధికారంలో ఉందనే మాటే కానీ బీజేపీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకునే శక్తి లేదు.  మిత్ర పక్షాల మద్దతుతోనే బండిని నడిపిస్తోంది.  ఈమధ్య తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లు మూలంగా శిరోమణీ అకాళదళ్ లాంటి లాంగ్ టైమ్ మిత్ర పక్షం దూరమైంది.  మిగిలి ఉన్న వారిలో కూడ అసంతృప్తి బయటపడుతోంది.  ఇలాంటి సమయంలోనే వాళ్లకు వైసీపీ ఒక ఆశాదీపంలా కనబడుతోంది. 

Modi to offer key Post to Vijayasaireddy
Modi to offer key Post to Vijayasaireddy

తొలి నుండి జగన్ మోదీకి అనుకూలంగానే ఉన్నారు.  అగకుండానే కొన్నిటికి, అడగ్గానే ఇంకొన్నిటికి అలా బీజేపీ తీసుకుంటున్న ప్రతి నిర్ణయానికి మద్దతు ఇస్తున్నారు.  సంఖ్యాబలం పరంగా వైసీపీ సభలో పెద్ద పార్టీనే.  అందుకే ఆ మద్దతును తాత్కాలికంగా కాకుండా శాశ్వతంగా పక్కనపెట్టుకోవాలని భావించి వైసీపీని ఎన్డీయేలో చేర్చుకోవాలని, అందుకుగాను కలిగించే ప్రయోజనాల్లో భాగంగా జగన్ కు అత్యంత సన్నిహితుడైన విజయసాయిరెడ్డికి కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలని బీజేపీ భావిస్తోందట.  సో.. అన్నీ కుదిరితే విజయసాయిరెడ్డి కీలక పదవిని పొందటం ఖాయంగా కనిపిస్తోంది.