దేశ ప్రధాని మోదీ శుక్రవారం ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. భారత్-చైనా బోర్డర్ లద్ధాఖ్ లో అనూహ్యంగా ప్రత్యక్షమయ్యారు. ఎలాంటి సమాచారం లేకుండా సైలెంట్ గా బోర్డర్ లో ఓ సైనికుడిలా వాలిపోయారు. చేతిలో తుపాకీ ఒక్కటే లేదు. అచ్చం సైనికుడి గెటప్ లో మారిపోయారు. ఎల్ ఏసీ వెంబడి పరిస్థితిని సమీక్షించారు. సైనిక అధికారులతో మాట్లాడారు. అంతకు ముందు అమరులైన జవాన్లకు నివాళులు అర్పించారు. గాయపడ్డ జవాన్లను పరామర్శించారు. ఆ తర్వాత తనదైన శైలిలో త్రివిద దళాల శక్తిని దిక్కులు పిక్కటిల్లేలా గర్జించి చెప్పారు. బోర్డర్ లో మహిళా సైనికుల బ్యాటిల్ ఫీల్డ్ ఎంతో స్ఫూర్తి నింపుతుం దన్నారు.
మీధైర్యం, అంకితభావం అసమానమైనవి. మీ ధైర్యం మీరంతా నిలబడే ఎత్తైన ప్రాంతాల కంటే ఎక్కువ అంటూ ప్రశంసలు కురిపించారు. భారత మాత శత్రువులు మీ అగ్ని, కోపాన్ని ఎన్నోసార్లు చూసాయి. భారత సైన్యం ముందు ప్రత్యర్ధులు దిగదుడుపే అన్నట్లు ఆత్మ విశ్వాసాన్ని వ్యక్తం చేసారు. మోదీ చేసిన ఆ వ్యాఖ్యలు సైనికుల్లో మరింత బలాన్ని నింపాయి. స్ఫూర్తిని రగిలించాయి. లడఖ్ లోప్రతీ రాయి, నదీ, గులకరాయి సహా ప్రతీది భారత్ లో అంతర్భాగం. పరాయి వాడి కన్ను దేశం పై పడింది. వాళ్ల సంగతేంటో చూద్దాం అన్న స్థాయిలో ప్రధాని వ్యాఖ్యానించారు. దీంతో చైనా ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
ఈ విషయం తెలియగానే చైనా విదేశాంగశాఖ స్పందించింది. సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను తగ్గించేందుకు ఇప్పటికే ఇరు దేశాలు సైనిక, దౌత్యపరంగా చర్చలు జరుపుతున్నాయి. ఇలాంటి సమయంలో పరిస్థితి తీవ్రతను పెంచే ఎలాంటి చర్యల్లో ఎవ్వరూ పాల్గొనకూడదు అంటూ తోక ముడిచేలా వ్యాఖ్యానించింది. మోదీ పర్యటనపై అసంతృప్తిని వెళ్లగక్కింది. మోదీ పర్యటనతో చైనా గుండెల్లో రైళ్లు పరిగెత్తడం మొదలైందని అర్ధమవుతోంది. ఇన్నాళ్లు కయ్యానికి కాలు దువ్వన చైనా పై భారత్ కూడా శాంతిని పక్కన బెట్టి అదే దూకుడు చూపించింది. ప్రధాని కూడా యుద్ధం విషయంలో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చేసారు. తాజా సన్నివేశంతో చైనా దూకుడు తగ్గించింది.