జూబ్లీహిల్స్‌ ప్రమాద ఘటనపై స్పందించిన బోధన్‌ ఎమ్మెల్యే

shakil

జూబ్లీహిల్స్‌లో గురువారం బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ కారుపై బోధన్ ఎమ్మెల్యే షకీల్ స్టిక్కర్‌ ఉండడంతో.. ఆయనపై విమర్శలు వచ్చాయి. దీంతో షకీల్ స్పందిస్తూ ఓ వీడియో విడుదల చేశారు. ‘‘ప్రమాదానికి కారణమైన కారు నా బంధువులకు చెందినది. అప్పుడప్పుడు ఆ కారును నేను కూడా వాడుతుంటాను. ఈ ఘటనలో చిన్నారి మృతిచెందడం బాధాకరం. పోలీసులు సీసీ కెమెరా దృశ్యాలు, ఇతర సాంకేతిక ఆధారాలు పరిశీలించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి’’ అని ఎమ్మెల్యే పేర్కొన్నారు.