లోకేష్ తో కలిసి టీడీపీని బాలయ్య నడపనున్నారా !

ఆంధ్రప్రదేశ్ లో ఒకప్పుడు టీడీపీ నాయకులు రాజకీయాలను శాసించారు. అయితే ఇప్పుడు టీడీపీ పరిస్థితి మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా దాయనీయమైన పరిస్థితుల్లో ఉంది. ఇదే పరిస్థితి ఇంకొంతకాలం కొనసాగితే టీడీపీ నామరూపాలు లేకుండా పోతుందని టీడీపీ నాయకుల కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు పార్టీని నడిపించడానికి కొత్త నాయకులు కావాలని టీడీపీ నాయకులు, కార్యకర్తలు కోరుకుంటున్నారు. లోకేష్ పార్టీ పగ్గాలు చేపట్టాలని కొంతమంది నాయకులు కోరుతుంటే, ఇంకొంతమంది లోకేష్ పార్టీని నడిపించలేడని చెప్తున్న నేపథ్యంలో బాలయ్య వాళ్లకు షాక్ ఇవ్వనున్నారు.

బాలయ్య పార్టీ పగ్గాలు చేపట్టనున్నారా !

ఇక బాలయ్యను ఎపుడో తన రాజకీయ వారసుడు అంటూ ఎన్టీయార్ ప్రకటించారు. కానీ బాలయ్య దాన్ని లైట్ తీసుకున్నారు. కానీ బావ చంద్రబాబు మాత్రం సీరియస్ గానే తీసుకుని తానే మామకు తగిన అల్లుడు అని పార్టీని చేతుల్లోకి తీసుకున్నారు. బాలయ్య కూడా చంద్రబాబుతో కలిసి ఇప్పటికి నడుస్తున్నాడు. అయితే ఇప్పుడు పార్టీ పతనావస్థకు చేరుకున్న దశలో పార్టీని నడిపించడానికి బాలయ్య ముందుకు వస్తున్నారని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఏపీ ప్రెసిడెంట్ గా అచ్చెన్నాయుడుని నియమించాలని బాబు భావించారు. దానితో పాటు కమిటీని కూడా నియమించారు. కానీ ఆ కమిటీ ప్రకటన బయటకు రాకుండా అడ్డుకున్నది బాలయ్య అని మాట వినిపిస్తోంది. ఎందుకంటే దయనీయమైన స్థితిలో ఉన్న పార్టీని నారా లోకేష్ తో కలిసి నడిపించడానికి బాలయ్య సిద్ధమయ్యారని, అందుకే పార్టీ ప్రెసిడెంట్ ప్రకటనను బాలయ్య అడ్డుకున్నారని తెలుస్తుంది.

బాలయ్య వల్ల టీడీపీ మెరుగవుతుందా!

2019 ఎన్నికల్లో వచ్చిన ఫలితాల వల్ల టీడీపీ నాయకులు, కార్యకర్తలు చాలా నిరుత్సాహంగా ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో బాలయ్య పార్టీ పగ్గాలు చేపట్టి లోకేష్ తో కలిసి పార్టీని నడిపిస్తే టీడీపీలో నూతన ఉత్సాహం వస్తుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. బాలయ్య తనకున్న ముక్కుసూటి తనంతో వైసీపీ నేతలకు చుక్కలు చూపిస్తారని, అలాగే ప్రజల నుండి కూడా ఎన్టీఆర్ కొడుకన్న సింపథి కూడా వర్క్ ఔట్ అవుతుందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.