శివుడిని పూజించే సమయంలో అస్సలు చేయకూడదని పొరపాట్లు ఇవే?

మనలో చాలామంది ఎక్కువగా పూజించే దేవుళ్లలో పరమేశ్వరుడు ఒకరు. శివుడిని పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని మనలో చాలామంది బలంగా నమ్ముతారు. సోమవారం శివునికి ఇష్టమైన దినం అనే సంగతి తెలిసిందే. లింగ రూపంలో ఉండే శివుడిని పూజించడం వల్ల నిత్య జీవితంలో అనుకూల ఫలితాలు కలిగే ఛాన్స్ అయితే ఉంటుందని చాలామంది భావనను కలిగి ఉంటారు. శివుడిని పూజించడం ద్వారా కోరుకున్న కోరికలు సులువుగా తీరతాయని చాలామంది భావిస్తారు.

అయితే శివుడిని పూజించే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు కొన్ని పొరపాట్లు అస్సలు చెయ్యకూడదు. శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన వాటిలో విభూతి ఒకటి కాగా విభూతిని ధరించడం వల్ల శివుని అనుగ్రహం మనపై ఉండే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. అడ్డంగా మూడు గీతలను భస్మ ధారణ చేయడం వల్ల గత జన్మలో చేసిన పాపాలు సైతం తొలగిపోతాయని చాలామంది భావిస్తారు.

శివునికి బిల్వ పత్రం సమర్పిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. శివుని మూడు కనులకు మూడు ఆకులతో ఉండే బిల్వ పత్రం చిహ్నం కావడంతో పాటు త్రిశూలానికి కూడా ఇది సంకేతమని చెప్పవచ్చు. అయితే ముక్క పోయిన ఆకులను దేవునికి పెట్టకూడదు. అష్టమి, నవమి, పౌర్ణమి, మకర సంక్రాంతి, సోమవారం బిల్వ పత్రాలను కోయకూడదు. శివునికి కుంకుమను పెట్టకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి.

శివలింగంపై కొబ్బరి నీళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ వేయకూడదు. శివుడిని పూజించే ముందు వినాయకుడిని పూజించడం మంచిది. శివునికి తులసి ఆకులను సమర్పించడం మంచిది కాదు. శివలింగం అభిషేకానికి స్టీల్ స్టాండ్ ను వినియోగించడం కూడా ఏ మాత్రం మంచిది కాదు. శివుడు శాపం విధించడం వల్ల శివుని పూజకు సంపంగి పూలను వాడకూడదు.