Meera Rajputh: సాధారణంగా సోషల్ మీడియాలో పలు హీరో హీరోయిన్లు గురించి పెద్ద ఎత్తున పొగుడుతూ, విమర్శిస్తూ కామెంట్లు చేస్తుంటారు. అయితే కొందరు సెలబ్రెటీల వాటిని చూసి చూడనట్టు వదిలేయగా మరి కొందరు మాత్రం వాటిని ఎంతో సీరియస్ గా తీసుకొని తిరిగి వారికి భారీ ఎత్తున కౌంటర్ ఇస్తుంటారు. తాజాగా ఇలాంటి ఘటన మీరా రాజపుత్ విషయంలో చోటు చేసుకుంది. తాజాగా ఆమె తనక్ బాడీ పార్ట్స్ గురించి దారుణంగా ట్రోలింగ్ చేసిన కొందరు నెటిజన్లకు సరికొత్త పద్ధతిలో సరైన సమాధానం చెప్పింది.
ఈ క్రమంలోనే నటి ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒక ఫోటోని షేర్ చేసింది. ఈ ఫోటో సాయంత్రం సమయంలో సముద్రతీరాన నిలబడి ఉండగా సూర్యుడి పై క్లిక్ చేయగానే మాయమైపోవడం మరొక ఫోటోలు చెప్పులు, షూలు వేసుకుని కనిపించింది.ఈ క్రమంలోనే కొందరు నెటిజన్లు స్పందిస్తూ మీ పాదాలకు ఏమైంది శరీరం మొత్తం తెల్లగా ఉన్న పాదాలు మాత్రమే నల్లగా ఎందుకు ఉన్నాయి అంటూ కామెంట్ చేశారు.ఈ క్రమంలోనే ఈ కామెంట్ల పై స్పందించిన నటి నిత్యం ఎల్లప్పుడు నా పక్కన ఉండే నా చేతులకు నా శరీర బరువును మోసే నా పాదాలకు, నా వేలు లెక్కించడానికి మద్దతు ఇవ్వగా నా పాదాలు నన్ను దృఢంగా నిలబెట్టినందుకు ధన్యవాదాలు అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
ఇలా తన గురించి కామెంట్లు చేసిన వారికి ఈమె తన ట్వీట్ తో సరైన సమాధానం చెప్పింది అని కొందరు ఈమె కామెంట్లపై కురిపించారు. తన గురించి చేసిన కామెంట్స్ పై స్పందించిన ఈమె ప్రస్తుతం దుబాయ్ లో తన భర్త పిల్లలతో కలిసి ఎంజాయ్ చేస్తున్నటువంటి ఫోటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.