ఓరి నాయనో .. ఇంతమంది ఎమ్మెల్యే లకి మంత్రి పదవులా – జగన్ ఏమైపోతాడు !

cm jagan new

 09 తొలగించి వాళ్ళ స్థానంలో కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలనే ఆలోచనలో సీఎం జగన్ ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పుడు ఉన్న మంత్రుల్లో దాదాపు సగానికి సగం మందిని ఇంటికి పంపబోతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

cm jagan new

 ఒక జిల్లా నుండి మంత్రిని తొలిగితే అదే జిల్లా నుండి మరొకరి అవకాశం ఇవ్వటం అనేది ఆనవాయితీ, అయితే కుల సమీకరణాలు అడ్డు పడటంతో ఈసారి అందులో చిన్న చిన్న మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లా నుండి రాష్ట్ర మంత్రి వర్గంలో ముగ్గురు మంత్రులు ఉన్నారు.

ఆ జిల్లా నుండి ముగ్గురు  

కొవ్వూరు ఎమ్మెల్యే తానేటి వ‌నిత‌, ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని ( డిప్యూటీ సీఎం కూడా), ఆచంట ఎమ్మెల్యే రంగ‌నాథ‌రాజు మంత్రులుగా ఉండ‌గా… వీరిలో వ‌నిత‌, రంగ‌నాథ‌రాజును గ్యారెంటీగా త‌ప్పించేస్తార‌ని వైసీపీ వాళ్లే చెపుతున్నారు. ఆళ్ల నాని ప‌ద‌వి ఉంటుందా ? ఊడుతుందా ? అనేది అప్పటి సామాజిక స‌మీక‌ర‌ణ‌ల‌ను బ‌ట్టి జ‌గ‌న్ నిర్ణయం తీసుకోవ‌చ్చు. కాపు వ‌ర్గంలో బంద‌రు ఎమ్మెల్యే పేర్ని నాని ప్రభుత్వ వాయిస్ బ‌లంగా వినిపిస్తుండ‌డంతో ఆళ్ల నానిని కూడా కంటిన్యూ చేసే అవ‌కాశాలు త‌క్కువే అని ఓ లెక్క.

 జ‌గ‌న్ కేబినెట్ లో ప‌డే ఫ‌స్ట్ వికెట్ రంగ‌నాథ రాజుదే. క్షత్రియ కోటాలో జ‌గ‌న్‌కు న‌మ్మిన‌బంటుగా ఉన్న న‌ర‌సాపురం ఎమ్మెల్యే ముదునూరు ప్రసాద‌రాజుకే మంత్రి ప‌ద‌వి రావాల్సి ఉండ‌గా… రంగ‌నాథ రాజు త‌న‌కు వ‌య‌స్సు అయిపోతోంద‌ని.. ఇదే ఆఖ‌రి అవ‌కాశం అంటూ జాతీయ‌స్థాయిలో క్షత్రియ వ‌ర్గం నేత‌ల‌తో జ‌గ‌న్‌కు రిక‌మెండ్ చేయించుకుని మ‌రీ మంత్రి ప‌ద‌వి పొందార‌న్న టాక్ ఉంది. ఆయ‌న ప‌నితీరుపై కూడా జ‌గ‌న్ అంత సంతృప్తిగా అయితే లేరంటున్నారు. దీనితో ఆయన స్థానంలో ప్రసాద్ రాజు కి అవకాశం రావచ్చు.

మంత్రి అనిల్ కుమార్ ను తప్పిస్తారా..?

 ఇక ఎస్టీ కోటాలో తెల్లం బాలరాజుకు గతంలోనే మంత్రి పదవి ఖాయమని అనుకున్నారు కానీ, కురుపం ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి ఆ పదవిని తన్నుకుపోవటంతో బాలరాజు సైలెంట్ అయ్యిపోయారు. ఈ ధపాలో సీనియర్ నేతగా ఎస్టీ కోటాలో మంత్రి పదవి ఖాయమని ఆయన భావిస్తున్నాడు. క బీసీ కోటాలో త‌ణుకు నుంచి రెండోసారి గెలిచిన కారుమూరి నాగేశ్వర‌రావు సీనియ‌ర్ అయినా… యాద‌వ వ‌ర్గంలో అనిల్‌కుమార్‌ను త‌ప్పిస్తారా ? లేదా ? అన్నది డౌటే. అయినా ఇదే వ‌ర్గంలో మాజీ మంత్రి పార్థసార‌థి కూడా బెర్త్‌పై క‌న్నేశారు. వీరిద్దరిని దాటుకుని కారుమూరికి ఛాన్స్ రావ‌డం క‌ష్టమే.

 భీమ‌వ‌రంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను ఓడించిన గ్రంధి శ్రీనివాస్ సీనియ‌ర్‌. ఆయ‌న కూడా రెండోసారి ఎమ్మెల్యే అయ్యారు. గ‌తంలో దూకుడుగా ఉండే ఆయ‌న ఇప్పుడు చిన్న వివాదం కూడా లేకుండా చూసుకుంటున్నారు. ఇప్పటికే ఆయ‌న కాపు కోటాలో మంత్రి ప‌ద‌వి వ‌స్తుంద‌ని అనుచ‌రుల‌తో చ‌ర్చించ‌డంతో పాటు గ‌ట్టి న‌మ్మకంతో ఉన్నారు. ప‌వ‌న్‌పై గెల‌వ‌డ‌మే ఆయ‌న‌కు ప్లస్‌.

 నరసాపురం ఎమ్మెల్యే ప్రసాద్ రాజుకు, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజుకు, భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కు ఈ మంత్రి వర్గ విస్తరణలో మంత్రి పదవులు రావటం ఖాయమనే మాటలు వినిపిస్తున్నాయి. వీరు మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది మంత్రి పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. బండ మెజారిటీ 150 మంది ఉండటంతో మంత్రి పదవుల ఆశావహుల జాబితా కూడా ఎక్కవుగానే ఉంది. మరి సీఎం జగన్ ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో, ఎవరెవరిని తన టీం నుండి తొలిగించి, ఎవరెవరికి అవకాశం ఇస్తాడో చూడాలి