హైదరాబాద్‌లో పబ్‌ల నిర్వహణపై అనేక విమర్శలు వస్తున్న వేళ యజమానులతో శ్రీనివాస్ గౌడ్ సమీక్ష నిర్వహించారు. పబ్‌ల నిర్వహణ విషయంలో పాటించాల్సిన నియమ నిబంధనలపై యజమానులతో మంత్రి చర్చించారు. ” మాదక ద్రవ్యాలు ఏ రూపంలో ఉన్నా అడ్డుకునేందుకు సిద్దమని.. చట్టాన్ని అతిక్రమిస్తే అవసరమైతే పీడీ చట్టం ప్రయోగిస్తాం. మాదక ద్రవ్యాలు విక్రయించే వాళ్లకు రాష్ట్రంలో చోటు లేద”ని తెలిపారు ఇటీవల ఫుడింగ్ పబ్‌లో కొకైన్ పట్టుబడిన నేపథ్యంలో ఈ సమావేశంపై ప్రాధాన్యం సంతరించుకుంది.