AP: ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నిన్నటి ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ గురించి చేసిన వ్యాఖ్యలపట్ల ఏపీ రాజకీయంలో తీవ్రదుమారం రేపుతోంది. జగన్మోహన్ రెడ్డి పవన్ గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కార్పొరేటర్ కంటే ఎక్కువ ఎమ్మెల్యే కంటే తక్కువ జీవిత కాలంలో ఆయన మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు కాబట్టి అలా మాట్లాడుతున్నారు అంటూ పవన్ కళ్యాణ్ పై సెటైర్లు వేశారు.
ఇలా పవన్ కళ్యాణ్ గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలపై జనసేన నేత మంత్రి నాదెండ్ల మనోహర్ కాస్త ఘాటుగా రియాక్ట్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా టార్గెట్ చేయాల్సిన అవసరం లేదని తెలిపారు. మేము కూడా అనొచ్చు కత్తిపోటుకు ఎక్కువ గొడ్డలి పోటుకో తక్కువ అంటూ ఈయన కూడా జగన్మోహన్ రెడ్డికి రీ కౌంటర్ ఇచ్చారు.
ఇక జగన్మోహన్ రెడ్డి గురించి మనోహర్ మాట్లాడుతూ అసలు జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తే కదా ఆయనకు ప్రజా సమస్యలు తెలిసేది అంటూ మాట్లాడారు.అసలు, క్రిమినల్ మైండ్ తో పవన్ కల్యాణ్‌ని ప్రత్యేకంగా టార్గెట్ చెయ్యాల్సిన అవసరం ఏం వచ్చిందని మండిపడ్డారు.. ఏ విధంగా బాబాయ్ హత్య జరిగింది అనేది అందరికీ తెలుసని నాదేండ్ల మనోహర్ తెలిపారు.
ఇంకా ఎన్నికలకు చాలా సమయం ఉంది ఇప్పటినుంచి పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ వస్తే ఆయన సరైన మూల్యం చెల్లించుకోక తప్పదని తెలిపారు. జర్మనీలో ఉన్న చట్టాలను ఏపీలో అమలు చేస్తానంటే ఎలాగా అని ప్రశ్నించారు వై నాట్ 175 అన్న జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు వచ్చేటప్పటికి మతి భ్రమించింది అంటూ విమర్శించారు.తాడు బొంగరం లేని పార్టీ.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అని సెటైర్లు వేశారు. తన ప్రజా జీవితంలో ఒక్క రూపాయి అయినా ఇచ్చి దాతగా జగన్ నిలబడ్డారా ? అని నిలదీశారు.. కానీ, మా పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వేలాదిమందికి ఆర్ధిక సాయం చేశారని అలాంటి వ్యక్తి గురించి జగన్ విమర్శించడం సరికాదు అంటూ నాదెండ్ల తనదైన శైలిలోనే సమాధానం ఇచ్చారు.