Gallery

Home News మంత్రి మల్లారెడ్డి పక్కా ఫ్యామిలీ మ్యాన్

మంత్రి మల్లారెడ్డి పక్కా ఫ్యామిలీ మ్యాన్

చామకూర మల్లారెడ్డి… మనిషి చాలా జోవియల్… ఎంత ఎదిగినా తల పొరగు ఏమాత్రం తలకెక్కని మనిషి… ఎంత సరదా మనిషో… అంత కమర్షియల్ మనిషి అంటారు అంతా. ఇది అతనిలో ఒక కోణం. మరో కోణం పక్కా ఫ్యామినీ మ్యాన్. వ్యాపార సాంరాజ్యాన్ని ఎలా విస్తరించిన తన వాళ్ల చేతికప్పగించాడో…అలాగే రాజకీయ వారసత్వాన్ని తన పిల్లలకు, బంధుగణానికి అప్పగిస్తూ వస్తున్నారు ఈ తెలంగాణ మంత్రి. అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చి టీడీపీ నుంచి ఎంపీ అయిన ఈయన ఆతర్వాత టీఆర్ఎస్ లో చేరి ఏకంగా క్యాబినెట్ మంత్రి అయ్యారు.

Malla Reddy | Telugu Rajyam

తెలంగాణలో తలపండిన రాజకీయ మేధావులు కూడా ఇయనంత తేలిగ్గా పనులు చక్కబెట్టుకోలేకపోతున్నారు. ప్రస్తుతం ఈయన మేడ్చల్‌ జిల్లా రాజకీయాలన్నీ శాసిస్తున్నారు. క్యాబినెట్ మంత్రి కాగానే వచ్చిన సర్పంచ్‌ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను మంత్రిగారు తన మద్దతుదారులకే ఇప్పించుకున్నారని టాక్. లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి ఎంపీ టికెట్‌  కోసం టీఆర్‌ఎస్‌లో హేమాహేమీలు పోటీపడ్డా కేసీఆర్ మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డికే టికెట్‌ ఇచ్చారు. ఎంపీ ఎన్నికల్లో అల్లున్ని గెలిపించుకోలేకపోయినా… పార్టీలో ఈయన హవా ఏమాత్రం తగ్గలేదు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో బంధుగాణానికి, అనుచరగణానికి పప్పు బెల్లాల్లా పార్టీ టిక్కెట్లు పంచేశారు. ఇక కార్పొరేషన్‌, మున్సిపల్‌ ఎన్నికల్లో టికెట్లు అమ్ముకున్నారని ఆరోపిస్తూ ఆడియో టేపులు బయటకు వచ్చినా కేసీఆర్ ఈయన్ని జస్ట్ అలా మందలించి వదిలేశారంట. సేమ్ టు సేమ్ కో ఆపరేటివ్‌ ఎన్నికల్లో కూడా ఇదే తీరు… తన బంధువులను బరిలో దింపి గెలిపించుకున్నారు.

Dc Cover Tvvq47Fa2Un2P4Ba0Tnqc0Uvm0 20160601032751.Medi | Telugu Rajyam

తాజాగా  మేడ్చల్‌ నియోజకవర్గం టీఆర్‌ఎస్‌ ఇంఛార్జ్‌ గా మల్లారెడ్డి పెద్ద కుమారుడు మహేందర్‌రెడ్డి పేరును అధికారికంగా ఖరారు చేశారు. రానున్న రోజుల్లో ఈయనకి మంచి నామినేటెడ్‌ పోస్టు ఇప్పించుకునేందుకు ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నారంట మంత్రి మల్లారెడ్డి. మరో కుమారుడు కూడా త్వరలో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారంట. ఇక మంత్రి గారి కుమార్తె మమతారెడ్డి సైతం రాజకీయాల్లోకి రావాలని ఆశపడుతున్నారు. అమెకు కూడా ఇప్పటి నుంచే రూట్ క్లియర్ చేస్తున్నారంట మల్లారెడ్డి. తెలంగాణ రాజకీయాల్లో తలపండిన మేధావులతోని కాదని ఈయన ఎలా చేయగలగుతున్నారని అంటారా… సక్సెస్ సీక్రెట్ చాలా సింపుల్ అండి…. ఎవరితో ఎలాంటి పేచీలు పెట్టుకోకుండా … తనదైన పక్కా కమర్శియల్ పంథాలో ముందుకెళ్లడమే.

 

- Advertisement -

Related Posts

కరోనా ఎఫెక్ట్: ఈ ఏడాదైనా ఎన్టీవీ ‘కోటి దీపోత్సవం’ జరిగేనా..?

ప్రముఖ వార్తా చానెల్ ఎన్టీవీ ఆధ్వర్యంలో ప్రతి ఏటా కార్తీకమాసంలో కోటి దీపోత్సవం కార్యక్రమం జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రత్యక్షంగా వేలమంది భక్తులు పాల్గొనే ఈ కార్యక్రమాన్ని సంస్థకే చెందిన భక్తి చానెల్...

ఐటీ పాలసీ, EMC, డిజిటల్ లైబ్రెరీలపై సీఎం జగన్ సమీక్ష…పలు కీలక నిర్ణయాలు !

తాడేపల్లి: ఎపీ సీఎం క్యాంప్ ఆఫీస్‌లో ఐటీ పాలసీ, ఎలక్ట్రానిక్‌ మాన్యుఫాక్చరింగ్‌ క్లస్టర్స్(EMC) ,గ్రామాల్లో డిజిటల్ లైబ్రెరీల ఏర్పాటుపైన అధికారులతో సమీక్షించిన ముఖ్యమంత్రి జగన్ పలు కీలక నిర్ణయాలు తీసుకోవటం జరిగింది. ఈ...

ఇప్పటిదాకా ఆసుపత్రుల దోపిడీ, ఇకపై విద్యా సంస్థల దోపిడీ.

కరోనా సెకెండ్ వేవ్ నేపథ్యంలో ప్రైవేటు ఆసుపత్రులు అడ్డగోలుగా దోచేశాయ్. ఇప్పుడు ప్రైవేటు విద్యా సంస్థల వంతు వచ్చినట్టుంది. దోపిడీ షురూ అయ్యింది. వేలల్లో లక్షల్లో ఫీజుల్ని గుంజేస్తున్నాయి ప్రైవేటు విద్యా సంస్థలు....

Latest News