Delhi Results 2025: ఆప్ ను చీపురుతో కూడిచేసాం… తెలంగాణనే టార్గెట్: బండి సంజయ్

Delhi Results 2025: నేడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలవుతున్నాయి. ఈ క్రమంలోనే తీవ్ర ఉత్కంఠత నెలకొంది అయితే ఈ ఎన్నికలలో గెలుపు బిజెపిదే ఖాయమైన సంగతి తెలిసిందే. ఆప్ పార్టీతో పోలిస్తే బీజేపీ ముందంజలో ఉన్న నేపథ్యంలో ఢిల్లీ పీఠం బిజెపి కైవసం చేస్తుందని స్పష్టమవుతుంది ఇలాంటి నేపథ్యంలోనే తెలంగాణ బిజెపి నాయకుడు బండి సంజయ్ ఢిల్లీ ఫలితాలపై స్పందించారు.

ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ..ఢిల్లీ ప్రజలు చీపురుతో ఆమ్ ఆద్మీ పార్టీని ఊడ్చేశారన్నారు. ప్రజాస్వామ్య బద్ధమైన పాలనను డిల్లీ ప్రజలు కోరుకున్నారన్నారు. అవినీతి, కుంభకోణాలు, జైలు పార్టీలు మాకు వద్దు అనుకున్నారన్నారు. ఢిల్లీలో కాషాయ జెండా ఎగురుతుందని ముందు నుంచి ఊహించిందేనన్నారు. ఇక ఢిల్లీలో కూడా బిజెపి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలోనే తదుపరి తమ టార్గెట్ తెలంగాణ అని అంటూ ఈయన మాట్లాడారు.

వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో కూడా తమ పార్టీ అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తామని బండి సంజయ్ తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీనే విజయం సాధిస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని మేధావి వర్గం, ఉద్యోగ ఉపాధ్యాయులు ఆలోచించి ఓట్లు వేయాలి అంటూ ఈయన కోరారు.

ఇక ఇప్పటికే మహారాష్ట్రలో కూడా బిజెపి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే తాజాగా ఢిల్లీలో కూడా బిజెపి అధికార పీఠాన్ని అందుకోబోతున్న నేపథ్యంలో బీజేపీ నాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలలో కూడా బిజెపి బలోపేతం అవ్వటానికి నాయకులు పెద్ద ఎత్తున కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే బండి సంజయ్ సమ నెక్స్ట్ టార్గెట్ తెలంగాణనే అంటూ మాట్లాడటంతో ఈ వ్యాఖ్యలు కాస్త సంచలనంగా మారాయి.