వరద బాధితులు ఇబ్బందులు… చంద్రబాబు మాత్రం రాజకీయం చేస్తున్నాడు

Ambati Rambabu

తాజాగా ఆంధ్రప్రదేశ్ జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు తెలుగుదేశం నేతలపై మండిపడ్డారు. తాజాగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో వర్షాలు పుష్కలంగా కురుస్తున్నాయి అని.. కానీ చంద్రబాబు పాలనలో వర్షాలు కానీ, గేట్లు ఎత్తడం కానీ జరగలేదు అని అన్నారు.

ఓ వైపు వరద బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. చంద్రబాబు మాత్రం తమ పార్టీ జెండాలతో కార్యకర్తలతో రాజకీయాలు చేస్తున్నాడు అని మండిపడ్డారు. గోదావరి వరద బాధితులతో చంద్రబాబు టీడీపీ జెండాలతో వెళ్తారా అంటూ ప్రశ్నిస్తూ ఇది సిగ్గుచేటు కాదా అంటూ వెటకారం చేశారు. జగన్ ప్రభుత్వం పై బురద చల్లందుకే ఆయన అలా ఆరోపణలు చేస్తున్నారు అని మండిపడ్డారు. అంతేకాకుండా డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడం టీడీపీ ప్రభుత్వం చేసిన చారిత్రాత్మక తప్పు అని అన్నారు.