మెగాస్టార్ కోసం మిల్కీ బ్యూటీ ఫిక్సయ్యిందా.?

Milky Beauty In Consideration For Mega Star | Telugu Rajyam

మెగాస్టార్ చిరంజీవితో తొలిసారిగా ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో నటించింది మిల్కీ బ్యూటీ తమన్నా. ఆ సినిమాలో సెకండ్ హీరోయిన్ పాత్ర పోషించినా, తమన్నా పాత్రకు చాలా మంచి పేరొచ్చింది. మెగాస్టార్ నుంచి మంచి ప్రశంసలు దక్కించుకుంది మిల్కీ బ్యూటీ.

ఇక ఇంకోస్సారి.. మెగాస్టార్‌తో మిల్కీ బ్యూటీ జత కట్టబోతోందా.? అంటే అవుననే గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం చిరంజీవి వరుసగా ప్రాజెక్టులు కన్‌ఫామ్ చేసి పెట్టిన సంగతి తెలిసిందే. ఆల్రెడీ ‘ఆచార్య’లో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్త్తోంది. ఇక నవంబర్ 15నుంచి సెట్స్ మీదికెళ్లనున్న చిరు మరో సినిమా ‘భోళా శంకర్’‌లో హీరోయిన్‌గా తమన్నా పేరు పరిశీలనకొచ్చిందట.

మెహర్ రమేష్ ఈ సినిమాకి దర్శకుడు కాగా, కీర్తి సురేష్ చిరుకు చెల్లెలి పాత్ర పోషిస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా తమన్నా అయితే బావుంటుందని మేకర్స్ భావిస్తున్నారట. సో దాదాపు తమన్నా పేరు ఫిక్సయినట్లే అని తెలుస్తోంది. అధికారిక ప్రకటన త్వరలోనే వెల్లడి కానుంది.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles