Mehreen Pirzada : ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ మెహ్రీన్ కౌర్ ఫిర్జాజా. కరోనా టైమ్‌లో ఈ బ్యూటీ పెళ్లి పీటలెక్కేందుకు రెడీ అయ్యింది. ఘనంగా ఎంగేజ్‌మెంట్ చేసుకుని రేపో మాపో పెళ్లికి సిద్ధం అనుకున్నాకా, ఏం జరిగిందో ఏమో తెలీదు కానీ, ఆ పెళ్లి కాన్సిల్ చేసుకుంది.
పెళ్లి రద్దు కావడానికి కారణం తన కెరీరే.. అంటూ క్యాజువల్‌గా రీజన్ ఒకటి చెప్పేసి సింపుల్‌గా తప్పించేసుకుంది. తర్వాత సినిమాల్లో బిజీ అయిపోయింది. అయితే, తాజాగా మెహ్రీన్ కౌర్ మరోసారి ప్రేమలో పడిందంటూ వార్తలు గుప్పుముంటున్నాయ్.
ఓ ప్రముఖ వ్యాపార వేత్తతో మెహ్రీన్ ప్రేమ యవ్వారం నడిపిస్తోందంటూ వేడి వేడిగా వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయ్. ఇంతకీ ఎవరా వ్యాపార వేత్త..? అంటూ ఆరాలు తీయడం మొదలెట్టేశారు నెటిజన్లు. నిజంగానే హనీ పాప ప్రేమలో పడిందా.? లేక ఇది జస్ట్ గాలి వార్తయేనా.? నిప్పు లేనిదే పొగ రాదు కదా.. మరి, ఈ నిప్పు నిగ్గు తేలేదెప్పుడో.
మరోవైపు సోషల్ మీడియాలో కాన్సెప్ట్ వైజ్ ఫోటో షూట్లతో మెహ్రీన్ కేక పుట్టిస్తోంది. ఫాలోవర్లను విపరీతంగా పెంచేసుకుంటోంది. అలాగే, కొన్ని కొత్త ప్రాజెక్టులపై సైన్ చేసే దిశగా చర్చల్లో పాల్గొంటోంది.
కరోనా టైమ్‌లో ‘మంచిరొజులొచ్చాయ్’ సినిమాతో మెహ్రీన్ ప్రేక్షకుల్ని ఖుషీ చేసింది.
ప్రస్తుతం మెహ్రీన్ నటించిన ‘ఎఫ్ 3’ మూవీ విడుదలకు సిద్ధంగా వున్న సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మల్టీ స్టారర్ సినిమాలో వరుణ్ తేజ్‌తో మెహ్రీన్ జత కడుతోంది.