Megastar Mammootty : బ్రేకింగ్ : మెగాస్టార్ కి కరోనా పాజిటివ్.!అసలు వివరాలు ఇవే!

Megastar Mammootty : మెగాస్టార్ అంటే మనకి తెలిసిన టాలీవుడ్ మెగాస్టార్ ఒకరే కాదు ఒకే ట్యాగ్ తో ఇద్దరేసి హీరోలు ఉన్నట్టుగానే మెగాస్టార్ ట్యాగ్ తో అది కూడా మన మెగాస్టార్ చిరంజీవి స్టార్డం తోనే ఉన్న మరో బడా హీరో మమ్ముట్టి. మలయాళ ఇండస్ట్రీ మెగాస్టార్ మమ్ముట్టి బ్రేకింగ్ న్యూస్ ఇపుడు ఇచ్చారు.

తాను కరోనా పాజిటివ్ అయ్యినట్టుగా అధికారికంగా తెలిపారు. తాను అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కూడా తాను నిన్న కరోనా పాజిటివ్ అయ్యినట్టు తెలిపారు. అలాగే ప్రస్తుతం కాస్త జ్వరంగా మాత్రమే ఉందని మిగతా అంతా బాగానే ఉన్నానని ప్రస్తుతానికి ఐసోలేషన్ లో ఉన్నాను అని అన్ని డైరెక్షన్స్ తీసుకొని జాగ్రత్తలు అంతా పాటించవల్సిందిగా కోరారు.

అలాగే అందరు ఖచ్చితంగా మాస్కులు ధరించి సేఫ్ గా ఉండాలని కోరుకుంటున్నానని మమ్ముట్టి తెలిపారు. దీనితో ఈ వార్త మలయాళ ఇండస్ట్రీలో బ్రేకింగ్ గా మారింది. అయితే మమ్ముట్టి మన తెలుగులో దివంగత నేత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్రపై తీసిన “యాత్ర” చిత్రంలో వైఎస్సార్ రోల్ లో కనిపించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అయితే మమ్ముట్టి అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.