ఈ డేట్ న మెగా మాస్ పూనకాలకి రెడీగా ఉండమంటున్న దర్శకుడు బాబీ.!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఇప్పుడు రెండు సాలిడ్ రీమేక్స్ కి రెడి అయ్యిన సంగతి తెలిసిందే. వాటిలో ఆల్రెడీ గాడ్ ఫాథర్ షూట్ శరవేగంగా కొనసాగుతుండగా.. కొన్ని రోజుల్లో భోళా శంకర్ ని స్టార్ట్ చేయనున్నారు. ఇక ఇదిలా ఉండగా వీటి తర్వాత దర్శకుడు బాబీ తో ఓ పక్కా మాస్ మసాలా ఎంటర్టైనర్ మెగాస్టార్ చేయనున్నారు.

పూర్తిగా కొత్త కాన్సెప్ట్ తో మళ్లీ పాత మెగాస్టార్ ని చూసే విధంగా తీస్తానని మాట ఇచ్చాడు. మరి ఇప్పడు ఐతే ముందుంది మెగాస్టార్ పండగ అంటూ మెగా పూనకాలు ఇచ్చే అప్డేట్ ని ఇచ్చేందుకు మేము ఈ నవంబర్ 6న రెడీగా ఉన్నామని దర్శకుడు సూపర్ అప్డేట్ ఇప్పుడు ఇచ్చాడు. మరి ఈ మెగా పూనకాలు ఇచ్చే అప్డేట్ ఎలా ఉంటుందో చూడాలి.