అల్లు అరవింద్ పై తీవ్ర ఆగ్రహంలో మెగా ఫ్యాన్స్..!

తెలుగు చలన చిత్ర పరిశ్రమ దగ్గర ఉన్నటువంటి దిగ్గజ నిర్మాతలలో అయితే గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ కూడా ఒకరు. మరి అల్లు అరవింద్ అయితే ఎన్నో ప్రయోగాలు చేసి ఈ స్టేట్ కి వచ్చారు. అంతే కాకుండా తెలుగులో కూడా మొట్ట మొదటి స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ అంటూ “ఆహా” ని స్టార్ట్ చేశారు.

అయితే ఆహా లో ఎన్నో ఎంటర్టైనింగ్ షో లు ఉండగా నందమూరి బాలకృష్ణ ని కూడా మొదటి సారి తీసుకొచ్చి టాక్ షో చేసిన ఘనత కూడా అల్లు అరవింద్ కే చెందుతుంది. అయితే ఇది అంతా బాగానే ఉంది కానీ బాలయ్య చేసిన ఆ టాక్ షో రెండో సీజన్ మొదటి ఎపిసోడ్ ని ఊహించని గెస్టులతో తీసుకొచ్చారు.

ఏకంగా నారా చంద్రబాబు నాయుడు లోకేష్ లని తీసుకు రావడం పెద్ద సెన్సేసన్ అయ్యింది. అయితే అప్పుడు వరకు అంతా బాగానే ఉంది కానీ మెల్లగా మెగా ఫ్యాన్స్ లో మళ్ళ్లీ అసంతృప్తి స్టార్ట్ అయ్యింది. రాజకీయాలు పరంగా టీడీపీ ని ఇప్పుడు లేపడానికి అన్నట్టు అల్లు వారు తమ షో తో తీసుకొచ్చారు అంటూ కామెంట్స్ గట్టిగా వినిపిస్తున్నాయి.

పైగా నిన్న ఎపిసోడ్ చూసాక కూడా మరింత స్థాయిలో కామెంట్స్ ఎక్కువ అయ్యాయి. అసలు అల్లు అరవింద్ ఇలాంటి ఎపిసోడ్ ప్లాన్ చేయడం ఏమిటి అని తాను టీడీపీ కి సపోర్ట్ చేస్తున్నారు అంటూ తీవ్ర ఆగ్రహంలో మెగా ఫ్యాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో అసహనం వ్యక్తం చేస్తూన్నారు.