భర్త చనిపోయిన మరుసటి రోజు సంచలన నిర్ణయం తీసుకున్న మీనా… షాక్ లో ఫ్యాన్స్?

అలనాటి అందాల నటి మీనా గురించి తెలియని వారుండరు. తాజాగా మీనా భర్త విద్యాసాగర్ అనారోగ్య కారణంతో మృతి చెందాడు. ఈ ఘటనతో ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తనే ప్రపంచంగా భావించిన భర్త ఇలా హఠాన్మరణంతో మీనా దుఃఖంలో మునిగిపోయింది. అయితే భర్త చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న మీనా తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మీనా తీసుకున్న ఈ నిర్ణయం గురించి తెలుసుకున్న అభిమానులు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు అంటూ షాక్ అవుతున్నారు.

అసలు విషయానికి వస్తే మీనా తన భర్త చనిపోయిన మరుసటి రోజు తన జీవితంలో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది.ఆమె జీవితంలో ఇక సినిమాలలో నటించకూడదని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఇంతకాలం తన భర్త కూతురిని చూసుకుంటున్నాడు అని సినిమాలలో నటిస్తున్న మీనా ఇప్పుడు తన భర్త లేక కూతురు ఒంటరైపోతుందని భావించి మిగిలిన జీవితం తన కూతురికి తోడుగా ఆమెతో గడపాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఆమె ఒప్పుకున్న సినిమాలలో మాత్రమే నటించి తర్వాత వేరే కొత్త సినిమాలు చేయకూడదని నిర్ణయించుకుందని సమాచారం.

ఒకప్పుడు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషలలో ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన మీనా విద్యాసాగర్ తో పెళ్లయిన తర్వాత సినిమాలకు దూరమైంది. ఆ తర్వాత పాప జన్మించటంతో ఆమె ఆలనా పాలనా చూసుకుంటూ ఇంట్లోనే ఉండిపోయింది. అయితే మీనా భర్త మాత్రం ఆమె ని సపోర్ట్ చేస్తూ మళ్ళీ సినిమాలలో నటించమని చెప్పాడు. కూతురిని చూసుకునే బాధ్యత నాది అంటూ ఆమెకి హామీ ఇచ్చాడు. అలా భర్త సపోర్ట్ తో మళ్ళీ సినిమాలలోకి రీ ఎంట్రీ ఇచ్చిన మీనా దృశ్యం వంటి సూపర్ హిట్ సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. ఇప్పుడు తన భర్త చనిపోవడంతో కూతురికి తోడుగా ఉండటానికి సినిమాలకు మళ్లీ దూరం కావాలని నిర్ణయించుకుంది.