ప్రస్తుతం ఏ కాలేజీలో చూసినా కూడా సీనియర్ స్టూడెంట్స్ తమ జూనియర్స్ని ర్యాగింగ్ పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈ ర్యాగింగ్ ల వల్ల ఎంతోమంది విద్యార్థులు మనస్థాపం చెంది ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు కూడా అనేక ఉన్నాయి. అందువల్ల కాలేజీలలో ఈ ర్యాగింగ్ విధానాన్ని ప్రభుత్వం నిలిపివేసింది. ర్యాగింగ్ పేరుతో విద్యార్థులను ఇబ్బంది పెట్టే వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఇలా ర్యాగింగ్ విధానాన్ని అరికట్టడానికి పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ అక్కడక్కడ ర్యాగింగ్ పేరుతో విద్యార్థులను హింసిస్తూనే ఉన్నారు. తాజాగా ఒక వైద్య కళాశాలలో ర్యాగింగ్ చేసే విద్యార్థులను అదుపులోకి తీసుకోవటానికి మహిళా కానిస్టేబుల్ చేసిన పనికి అందరూ మెచ్చుకుంటున్నారు.
వివరాలలోకి వెళితే… ఇండోర్ లోని మహాత్మా గాంధీ మెమోరియల్ మెడికల్ కాలేజీలో జరుగుతున్న ర్యాగింగ్ ను నియంత్రించడానికి మధ్యప్రదేశ్ పోలీస్ విభాగానికి చెందిన 24 ఏళ్ల శాలిని చౌహాన్ అనే లేడీ కానిస్టేబుల్ అండర్ కవర్ ఆపరేషన్ మొదలు పెట్టింది. ఈ క్రమంలో విద్యార్థిగా మారిపోయి దాదాపు మూడు నెలల పాటు ప్రతిరోజు విద్యార్థి లాగే కాలేజీకి వెళ్లి అక్కడ స్నేహితులతో కలిసి తిరుగుతూ రహస్యంగా ర్యాగింగ్ కి సంబంధించిన పూర్తి వివరాలను సేకరించింది. కళాశాలలో సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులను హిందించటమే కాకుండా పోలీసులకు ఫిర్యాదు చేస్తే మరింతగా హింసిస్తామని భార్యను భయభ్రాంతులకు గురి చేయటంతో విద్యార్థులు పోలీస్ కంప్లైంట్ ఇవ్వటానికి భయపడుతున్నారని గ్రహించింది.
అండర్ కవర్ ఆపరేషన్ లో విద్యార్థిగా కాలేజీకి వెళ్లిన లేడీ కానిస్టేబుల్ .. ర్యాగింగ్ కి పాల్పడుతున్న 11మంది సీనియర్ స్టూడెంట్స్ ని గుర్తించి పై అధికారులకు రిపోర్ట్ చేసింది. లేడీ కానిస్టేబుల్ అందించిన రిపోర్ట్ ఆధారంగా ర్యాగింగ్ కి పాల్పడుతున్న 11 మంది సీనియర్ స్టూడెంట్స్ ని మూడు నెలల పాటు హాస్టల్ నుండి కాలేజీ నుండి డీవర్ చేసినట్లు కాలేజీ యాజమాన్యం వెల్లడించింది. లేడీ కానిస్టేబుల్ చేసిన పనికి జూనియర్ విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.