ఏఎన్ఆర్ ముందే కాలేజీ కుర్రాడిని ఈడ్చి తన్నిన డిస్కో శాంతి?

డిస్కో శాంతి ఈ పేరు గురించి పరిచయం అవసరం లేదు ఒకానొక సమయంలో ఈమె ఇండస్ట్రీలో వరుస సినిమాలలో ప్రత్యేక పాటలలో నటిస్తూ కుర్రకారులను తన డాన్స్ తో అందరిని ఆకట్టుకుంది. నిజం చెప్పాలంటే అప్పట్లో ఈమె పాటకు డాన్స్ చేస్తే చూడటం కోసమే చాలామంది థియేటర్లకు వచ్చేవాళ్ళు.ఇలా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరమయ్యారు.అయితే గతంలో డిస్కో శాంతి అక్కినేని నాగేశ్వరరావు గారి ముందే ఓ కాలేజీ కుర్రాడిని చితక్కొట్టిన సంఘటన గురించి తాజాగా ఈమె చెప్పుకొచ్చారు.

సాధారణంగా సినిమా సెలబ్రిటీలను కొందరు అభిమానిస్తూ దైవ సమానంగా భావిస్తుంటే మరికొందరు మాత్రం వారి వెకిలి చేష్టల కారణంగా సెలబ్రిటీలకు ఎంతో విసుగు తెప్పిస్తుంటారు. అందుకే సెలబ్రిటీలు జనాల మధ్యలోకి రావాలంటే ఎంతో కంగారు పడుతూ ఉంటారు. ఇకపోతే అక్కినేని నాగేశ్వరరావు నటించిన కాలేజీ బుల్లోడు సినిమాలో భాగంగా ర్యాగింగ్ ఆట అంటూ సాగిపోయే పాటలో డిస్కో శాంతి నాగేశ్వరరావు గారితో కలిసి డాన్స్ చేసింది.ఈ పాట చిత్రీకరణ జరుగుతున్న సమయంలో చుట్టూ కాలేజీ కుర్రాళ్ళు ఉన్నారు. అయితే ఈ షూటింగ్ జరుగుతున్న సమయంలో డిస్కో శాంతి కెమెరాకు ఎదురుగా ఒక కాలేజ్ కుర్రాడు నిలబడి ఆమెను చూస్తూ సైగలు చేశారు.

ఈ విధంగా ఆ కుర్రాడి సైగలను భరిస్తూ ఎంతో ఓపిక ప్రదర్శించిన డిస్కో శాంతి అలాగే షూటింగ్లో పాల్గొన్నారు. ఇకపోతే ఈ పాట చివరిలో ఏఎన్ఆర్ డిస్కో శాంతి టాప్ కత్తెరతో కత్తిరించే లాగాల్సిన సన్నివేశం ఉంది. ఈ సన్నివేశం షూట్ చేసే సమయంలో ఆ కాలేజీ కుర్రాడు పిచ్చి సైగలతో విసుగు తెప్పించాడు. ఇక తన చేష్టలకు విసిగిపోయిన డిస్కో శాంతి తనను దగ్గరకు పిలిచి ఒక్క తన్ను తన్నింది.ఇలా ఉన్నఫలంగా ఆ కుర్రాడిపై చేయి చేసుకోవడంతో చిత్ర బృందంతో పాటు నాగేశ్వరరావు కూడా షాక్ లోకి వెళ్లిపోయారు. ఇలా తను కొట్టే కొట్టుడుకి ఆ కుర్రాడు ఒక్కసారిగా గోడ దూకి పారిపోయాడు. అనంతరం నాగేశ్వరరావు డిస్కో శాంతిని పిలిచి అసలు ఏం జరిగిందనే విషయం కనుక్కున్నారు.అయినా అలా కొడితే జరగరానిది జరిగితే నువ్వు జైలు పాలు కావాల్సి వస్తుంది నీ కెరియర్ ఇబ్బందులలో పడుతుంది తల్లి అంటూ ఆరోజు ఏఎన్నార్ గారు చెప్పినట్లు డిస్కో శాంతి వెల్లడించారు.