సంతాన భాగ్యాన్ని ప్రసాదించే ఆలయం ఇదే.. ఈ ఆలయం ఎక్కడ ఉందంటే?

దేశంలో చాలామంది సంతాన భాగ్యం లేక నిత్య జీవితంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఆలస్యంగా పెళ్లిళ్లు కావడం కూడా సంతాన సమస్యలకు కారణమవుతోందని తెలుస్తోంది. తమకు పుట్టిన శిశువు కేరింతలు దంపతుల జీవితంలో మరపురాని క్షణాలుగా మిగిలిపోతాయని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. సంతానాన్ని పొందడంతో జీవిత పరమార్థం నెరవేరుతుందని చాలామంది ప్రజలు భావిస్తారు.

ఎవరికైతే సంతానం ఉండదో వాళ్లు నిత్య జీవితంలో పడే వేదన వర్ణానాతీతం. అంబావాలీ మాత దేవాలయాన్ని దర్శించుకోవడం ద్వారా సంతానం కలుగుతుందని చాలామంది భావిస్తారు. కాళ్‌రాత్రి మాత ప్రధాన దేవతగా ఈ ఆలయంలో పూజలు జరుగుతున్నాయి. ఈ ఆలయంలో సంతాన భాగ్యం ప్రసాదించాలని దేవతలను కోరుతూ మూడు కొబ్బరి కాయలను సమర్పించుకోవడం జరుగుతుంది.

ఈ ఆలయానికి చెందిన భక్తులు ఐదు వారాల పాటు మెడలో ధరించడానికి పూజారి ప్రత్యేకమైన దారాన్ని అందించడం జరుగుతుంది. సంతానం కలిగిన తర్వాత దేవాలయ ఆవరణలోని చెట్టుకు ఐదు కొబ్బరికాయలను భక్తులు కొట్టడం జరుగుతుంది. ఈ ఆలయంలో ఇతర ఆలయాలకు భిన్నంగా రాత్రి సమయంలో పూజలు నిర్వహించడం జరుగుతుంది. హారతి సమయంలో ‘మౌలీ’గా పిలవబడే దారాన్ని పూజలో ఉంచి ఐదు వారాల పాటు ఆ దారాన్ని ధరించాలి.

మనస్సులో సంతానం కలగాలని బలంగా కోరుకుంటే కోరుకున్న కోరిక కచ్చితంగా నెరవేరుతుందని చాలామంది భక్తులు భావిస్తారు. ఈ ఆలయాన్ని దర్శించుకున్న వాళ్లకు ఆడపిల్ల పుడితే ఆ పాప దుర్గా మాత అవతారం అని భావిస్తారు. ఇండోర్ లో ఉన్న ఈ ఆలయాన్ని పిల్లలు లేని వాళ్లు దర్శించుకోవడం ద్వారా మంచి ఫలితాలు కలిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.