Mayasabha: ఇద్దరు మిత్రులు రాజకీయ ప్రత్యర్థులుగా మారితే.. ఆకట్టుకుంటున్న మయసభ ట్రైలర్… చీఫ్ గెస్ట్ గా సాయి దుర్గ తేజ్!

Mayasabha: డైరెక్టర్ దేవా కట్ట దర్శకత్వంలో ఆది పినిశెట్టి చైతన్య రావు హీరోలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న వెబ్ సిరీస్ మయసభ. ఇద్దరు రాజకీయ ప్రత్యర్థుల మిత్రులుగా మారితే ఎలా ఉంటుందనే నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ వెబ్ సిరీస్ ఆగస్టు ఏడో తేదీ సోనీ లైవ్లో ప్రసారం కాబోతున్న నేపథ్యంలో గురువారం ఈ సిరీస్ నుంచి ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా మెగా హీరో సాయి దుర్గ తేజ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా సాయి దుర్గ తేజ్ మాట్లాడుతూ..

డైరెక్టర్ దేవా కట్టగారితో తనది పదేళ్ల ప్రయాణం అని తెలిపారు. ఆటోనగర్ సూర్య సినిమా చూసిన తర్వాత దేవా గారికి ఫోన్ చేసి మాట్లాడాలని అప్పటినుంచి మా ప్రయాణం మొదలయ్యి రిపబ్లిక్ సినిమా వరకు వచ్చిందని తెలిపారు. ఇక రిపబ్లిక్ సినిమా సమయంలో నాకు జరిగిన యాక్సిడెంట్ సమయంలో దేవా కట్ట ఎప్పుడు నాకు అండగా నిలిచారు. ఈరోజు నేను ఆయన సినిమా కోసం ఇలా రావడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. దేవా కట్టా గారు ‘మయసభ’ గురించి గతంలోనే ఎప్పుడో చెప్పారు. ఆది, చైతన్య నాకు చాలా ఏళ్ల నుంచి తెలుసు. 30 వెడ్స్ 21 చూసి మా అమ్మ నన్ను పెళ్లి గురించి అడుగుతూ ఉండేవారు. అలా నా లైఫ్‌లో చైతన్య విలన్‌లా మారిపోయాడు. ‘రిపబ్లిక్’ టైంలో సాయి కుమార్ నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చారు. ‘మయసభ’ ఈవెంట్‌కు రావడం ఆనందంగా ఉంది. ఈ సిరీస్ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

 Mayasabha | Sony LIV | Telugu Trailer | Streaming from 7th Aug

ఇక డైరెక్టర్ దేవ కట్ట మాట్లాడుతూ ఈ సిరీస్ కోసం వచ్చిన మా బ్రదర్ సాయి తేజ్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. మయసభ అనేది అందమైన ఊహ ఇద్దరు ప్రాణ స్నేహితుల ప్రయాణమే ఈ కథ అని తెలిపారు పరిస్థితుల వల్ల వారిద్దరి మధ్య ఏర్పడిన దూరం ఏంటి అనే కాన్సెప్ట్ ఆధారంగా ఈ సిరీస్ చేశామని దేవా కట్ట తెలియజేశారు. ఇక సోనీ లీవ్ సంస్థ అధినేత ధనిష్ దగ్గర ఈ విషయం గురించి మాట్లాడటంతో ఆయన ఈ సిరీస్ చేయడానికి ముందుకు వచ్చారని తెలిపారు.

ఇక ఈ సిరీస్ సినిమాగా చేయడం అంటే ఇబ్బంది అవుతుందని సిరీస్ రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నామని దేవా కట్ట వెల్లడించారు. ఇక ఈ సిరీస్ గురించి సోనీ లివ్ అధినేతలు కూడా మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఇక ఇందులో హీరోలుగా నటించిన ఆది పినిశెట్టి చైతన్య రావు కూడా ఈ సందర్భంగా మాట్లాడారు తమ మాయసభ ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి వచ్చిన సాయి ధరమ్ తేజ్ కు ముందుగా ధన్యవాదాలు తెలియజేశారు.. చిన్నప్పటినుంచి నాకు ఇలాంటి పొలిటికల్ కథలు నటించాలని కోరిక ఉండేదని అది ఇలా మయసభ ద్వారా నెరవేరింది అంటూ ఆది పినిశెట్టి తెలిపారు.

ఇక చైతన్య రావు కూడా దర్శకుడు దేవా కట్ట గురించి అలాగే మయసభ సిరీస్ గురించి ఎంతో అద్భుతంగా మాట్లాడారు తనకు అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలకు కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా నిర్మాతలతో పాటు ఇతర టెక్నీషియన్లు కూడా పాల్గొని ఈ సిరీస్ గురించి ఎంతో అద్భుతంగా మాట్లాడారు. మొత్తానికి మయసభ ట్రైలర్ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చెప్పాలి. ఇక ఈ సిరీస్ ఆగస్టు ఏడో తేదీ సోనీ లీవ్ లో ప్రసారం కానుంది.