Mayasabha Review: రిపబ్లిక్, ప్రస్థానం వంటి సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన దర్శకుడు దేవకట్ట తాజాగా మరొక పొలిటికల్ డ్రామా ఆయన మయసభ అనే వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ వెబ్ సిరీస్ ఆగస్టు ఆరో తేదీ నుంచి సోనీ లీవ్ ఓటీటీలోకి వచ్చింది. ప్రస్తుతం ప్రసారమవుతున్న ఈ మాయాసభ వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంది డైరెక్టర్ దేవా మరోసారి పొలిటికల్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YSR), ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CBN) జీవితాల్లోని మలుపుల్ని కథానాయికత్వంతో కలిపి ఈ వెబ్ సిరీస్ రూపొందించారు ఇందులో చంద్రబాబు నాయుడు పాత్రలో ఆది పినిశెట్టి నటించగా, రాజశేఖర్ రెడ్డి పాత్రలో చైతన్య రావు నటించారు. మరి పొలిటికల్ డ్రామా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ వెబ్ సిరీస్ కథ ఏంటి? ఈ సిరీస్ ద్వారా దర్శకుడు హిట్ కొట్టారా? అనే విషయానికి వస్తే..
కథ: ఈ సిరీస్ కథలో కృష్ణమ నాయుడు అలియాస్ ఆది పినిశెట్టి ఒక చిన్న రైతు కుటుంబానికి చెందిన వాడు. చిన్ననాటి నుంచే అతనికి రాజకీయాలపై గొప్ప ఆసక్తి. తన జీవితాన్ని ప్రజల సేవకే అంకితంగా పెట్టాలనే ఆశయం కలిగిన అతనికి కుటుంబం నుంచి ఏమాత్రం మద్దతు లభించదు మరోవైపు రామిరెడ్డి ఆలియాస్ వైయస్ రాజశేఖర్ రెడ్డి మృతి పరంగా వైద్యుడు అలాగే ఎంతో పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న కుటుంబం.అతని తండ్రి బాంబుల శివారెడ్డి రాయలసీమలో దాడులు, గుంపుల రాజకీయాలకు కేరాఫ్ అడ్రెస్ అయిన వ్యక్తి. తన తండ్రి తీరును తీవ్రంగా వ్యతిరేకించే రామిరెడ్డి, కృష్ణంనాయుడుతో ఓ యాక్సిడెంట్ ద్వారా పరిచయం అవుతాడు. ఈ పరిచయం కాస్త మంచి స్నేహంగా మారుతుంది.
కృష్ణమ నాయుడు, రామిరెడ్డి అనుకోకుండా రాజకీయాలలోకి వస్తారు. రాజకీయాలలోకి వచ్చిన తర్వాత వీరిద్దరి స్నేహం ఎలా మారుతుంది? దేశంలో ఎమర్జెన్సీ విధించిన ప్రధాని ఐరావతి బసు (దివ్యా దత్తా) నిర్ణయాలు రాష్ట్ర రాజకీయాలపై ఎలా ప్రభావం చూపించాయో, అగ్రనాయకుడు రాయపాటి చక్రధర్ రావు (సాయి కుమార్) ఏ విధంగా కీలక పాత్ర పోషించారో ఈ కథలో కృష్ణమ నాయుడు అతనికి ఎలా అల్లుడయ్యార? ఈ ప్రయాణంలో రాజకీయ మిత్రులుగా ఉన్నవారు శత్రువులుగా ఎలా మారారు? తదుపరి ఏం జరిగింది అనే విషయాలు తెలియాలి అంటే ఈ వెబ్ సిరీస్ చూడాల్సిందే.
విశ్లేషణ: ఈ వెబ్ సిరీస్ కు దేవ కట్టతో పాటు కిరణ్ జయకుమార్ కూడా దర్శకత్వం వహించారు.దర్శక ద్వయం ఈ కథను పూర్తిగా ఫిక్షనల్ అని ప్రకటించినప్పటికీ ఇందులో చూపించిన పాత్రలు ఏపీ రాష్ట్ర రాజకీయాలను తలపిస్తున్నాయని చెప్పాలి. ఇక ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు రాజశేఖర్ రెడ్డి పరిటాల రవి వంగ వంటి వారి పాత్రలు కీలకంగా ఉండబోతున్నాయని తెలుస్తోంది. తదుపరి ఎలాంటి సంఘటన జరగబోతుందనే ఉత్కంఠతలతో ఈ సిరీస్ ను ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇక ఇందులో హాస్పిటల్ ఎపిసోడ్స్ ప్రేమకథ సన్నివేశాలు కాస్త స్లోగా సాగాయి అని చెప్పాలి.
నటీనటుల నటన:
ఈ సిరీస్ లో కృష్ణమ నాయుడు, రామిరెడ్డి పాత్రలలో ఆది పినిశెట్టి చైతన్య రావు ఎంతో అద్భుతంగా నటించి వారి పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారు.ఎన్నికల ప్రచారం సన్నివేశాల్లో చైతన్య నటన వైఎస్సార్‌ను గుర్తు చేస్తుంది. అలాగే శంకర్ మహంతి (బాంబుల శివారెడ్డి), సాయి కుమార్ (రాయపాటి చక్రధర్ రావు) వారి నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇలా ప్రతి ఒక్కరూ వారి పాత్రలకు పూర్తి న్యాయం చేశారని చెప్పాలి. టెక్నికల్ పరంగా కూడా ఎవరు ఎక్కడా కాంప్రమైస్ కాకుండా చాలా అద్భుతంగా ఈ వెబ్ సిరీస్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.
ముగింపు: ఇప్పటివరకు ఎన్నో పొలిటికల్ నేపథ్యంలో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి అయితే ఇవన్నీ కూడా ఒక నాయకుడికే మద్దతుగా చూపిస్తూ వచ్చారు కాని మయాసభ మాత్రం రెండు వైపుల మంచి సమంగా నడిపించే ప్రయత్నం చేశారని చెప్పాలి.ఇది ఒక కొత్త కోణంలో రాజకీయాలను విశ్లేషించేందుకు ప్రయత్నించిన సీరీస్. ఒక కల్పిత కథ అని ప్రకటించినప్పటికీ, ప్రతి పాత్రను రూపొందించిన తీరు, వేషధారణ చూస్తే మాత్రం కచ్చితంగా ఏపీ రాష్ట్ర రాజకీయ నాయకులు గుర్తుకు వస్తారు. పొలిటికల్ గ్రామాలను రాజకీయాలను ఇష్టపడే వారికి ఈ వెబ్ సిరీస్ చాలా బాగా నచ్చుతుందని చెప్పాలి.
రేటింగ్: 3.5/5
