అబుదాబి: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నచెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఓపెనర్లు మంచి అరంభాన్ని ఇవ్వలేకపోయారు. సీఎస్‌కే వరుసగా వికెట్లు కోల్పోవడంతో తక్కువ స్కోరుకే పరిమితమైంది. చెన్నై 13 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. 3 ఓవర్ చివరి బంతికి డుప్లెసిస్(10) షాట్ ప్రయత్నించి జోస్ బట్లర్ చేతికి చిక్కాడు. ఇక కార్తీక్ త్యాగి వేసిన నాలుగో ఓవర్ చివరి బంతికి షేన్ వాట్సన్(8) ఔటయ్యాడు. ఆ ఓవర్‌లో రెండు వరుస ఫోర్లు కొట్టి మంచి ఊపు మీద కనిపించిన అతడు చివరి బంతికి రాహుల్ తెవాతియాకు చిక్కి ఔటయ్యాడు. దీంతో చెన్నై 26 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. తర్వాత సామ్ కరన్,అంబటి రాయుడు వికెట్లు కూడా కోల్పోవడంతో కష్టాల్లో పడింది చెన్నై. రవీంద్ర జడేజా(35 నాటౌట్; 30 బంతుల్లో 4 ఫోర్లు), ధోని(28; 28 బంతుల్లో 2 ఫోర్లు)లు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. వారి సహాయంతో సీఎస్‌కే 120 పరుగు మార్కుకు చేరింది. ఈ మ్యాచ్‌లో రాజస్తాన్ బౌలర్స్ దుమ్మురేపారు. ఆర్ఆర్ బౌలర్లలో ఆర్చర్, కార్తీక్ త్యాగి, శ్రేయస్ గోపాల్, రాహుల్ తెవాటియాలు తలో వికెట్ తీశారు.
Dream11 GameChanger of Match 37 between @ChennaiIPL and @rajasthanroyals is Jos Buttler. @Dream11 #YeApnaGameHai #Dream11IPL pic.twitter.com/IHUj42fdXb
— IndianPremierLeague (@IPL) October 19, 2020
చెన్నై నిర్దేశించిన 126 పరుగులు టార్గెట్‌ను సులువుగా ఛేదించి మరో విజయాన్ని తన ఖాతలో వేసుకుంది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రాయల్స్ టాపార్డర్ తడబడింది. దీపక్ చాహర్ వేసిన మూడో ఓవర్ చివరి బంతికి బెన్‌స్టోక్స్(19) ఔటయ్యాడు. దీంతో రాజస్థాన్ 26 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. తర్వాత హాజిల్‌వుడ్ వేసిన నాలుగో ఓవర్ రెండో బంతికి రాబిన్ ఉతప్ప(4) ఔటయ్యాడు. ఆ తర్వాత దీపక్ చాహర్ వేసిన ఐదో ఓవర్ మూడో బంతికి సంజూ శాంసన్ డకౌటై మరోసారి నిరాశ పరిచారు. 28 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి ఆర్ఆర్ తడబడింది. స్మిత్(26 నాటౌట్; 34 బంతుల్లో 2ఫోర్లు) జోస్ బట్లర్(70 నాటౌట్; 30 బంతుల్లో 7 ఫోర్లు,2 సిక్స్‌లు) రాజస్ధాన్‌ను ఆదుకున్నారు. అచితూచి ఆడుతూ పరుగులు రాబట్టారు. చివరకు ఆర్ఆర్ 17.3 ఓవర్లలోనే విజయాన్ని అందుకుంది. ఏడు వికెట్ల తేడాతో గెలిచింది.