Married Women: పెళ్లయిన 8 నెలలకే వివాహిత ఆత్మహత్య.. అసలేం జరిగిందంటే?

Married Women: ప్రస్తుత సమాజంలో ఆడవారిపై జరిగే అత్యాచారాలు, మానసిక వేధింపులు, ఇవన్నీ చాలవన్నట్లు పెళ్లయిన మహిళలకు వరకట్న వేధింపులు మరొక శాపంగా మారింది. అయితే పెళ్లై కొన్నేళ్లు బాగా ఉన్నవారు వరకట్నం కోసం మహిళలను వేధింపులకు గురి చేస్తున్నారు. కొందరు అయితే పెళ్లి అయిన కొన్ని రోజులు, నెలలకే వరకట్నం విషయంలో మహిళలను వేధించడం, చంపడం లాంటివి చేస్తున్నారు. అయితే కొందరు మహిళలు అత్తింటివారు పెట్టె వేధింపులు తాళలేక ఎంతోమంది ఆత్మహత్య చేసుకున్నారు. మరి కొందరు ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయిస్తున్నారు. సమాజంలో ఇలాంటి ఘటనలు రోజు వెలుగులోకి వస్తున్న కూడా ఇలా వరకట్నం ఈ విషయంలో వేధించే వారిలో మాత్రం మార్పు రావడం లేదు. అయితే తాజాగా ఇలాంటి ఘటన ఒకటి తమిళనాడులో చోటు చేసుకుంది.

తమిళనాడులోని తిరుచ్చి లో ఒక వివాహిత పెళ్లి అయినా 8 నెలలకే ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఇద్దరి కులాలు వేరు అయినప్పటికీ ఇరు కుటుంబాల అంగీకారంతో ఆ జంట పెళ్లి చేసుకున్నారు. ప్రేమ వివాహం అయినప్పటికీ కూడా ఆ యువతి తల్లిదండ్రులు కట్నంగా బంగారం డబ్బులు బాగానే ముట్టజెప్పారు. కానీ ఆ యువతి ని అదనపు కట్నం కోసం ఇంటివారు వేధించడంతో ఆ యువతి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. పెళ్లి కొన్నాళ్లు ఆమెను భర్తతో సహా అత్తింటివారు అందరూ బాగానే చూసుకుంటారు. కొద్ది రోజులు గడిచిన తరువాత కొన్ని నెలలుగా ఆమెను అదనపు కట్నం కోసం చిత్రహింసలకు గురి చేశారు. ఆమె భర్త కూడా కొత్తగా బిజినెస్ చేయాలి అనుకుంటున్నాను డబ్బు కావాలి అంటూ ఆ వివాహితను వేధించసాగాడు.

అత్తింటి వారు వేధించిన కూడా ఆ వివాహిత పెద్దగా పట్టించుకోలేదు. కానీ ప్రేమించి పెళ్లి చేసుకొని మూడు ముళ్లు వేసిన భర్త కూడా అదనపు కట్నం కోసం వేధిస్తుండటంతో తీవ్ర మనస్తాపం చెందిన ఆ వివాహిత అత్తారింట్లో ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. చనిపోయిన ఆ వివాహితను స్నేహ గా గుర్తించారు. ఆమె భర్త విజయకుమార్ ఒక ప్రైవేట్ బ్యాంకు లో ఉద్యోగం చేస్తున్నాడు. ప్రేమించి పెళ్లి చేసుకొని ఎన్నో ఆశలతో అత్తారింట్లో అడుగుపెట్టిన కూతురు ఇలా ఉరి వేసుకుని ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించడం చూసి స్నేహ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. ఈ ఘటనతో ఇరుగుపొరుగువారు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.