Crime News: ఒరిస్సాలో మావోయిస్టు ఘాతుకం…. బాంబు పేలి జర్నలిస్ట్ మృతి..!

Crime News: రోజు రోజుకి మావోయిస్టుల ఆగడాలు పెరిగిపోతూనే ఉన్నాయి. వారు చేసే దాడుల వల్ల ఎంతో మంది భద్రతా దళాలు, సామాన్య ప్రజలు కూడా ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. మావోయిస్టుల దాడిలో ఏ పాపం ఎరుగని ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఇటువంటి సంఘటన ఒరిస్సా రాష్ట్రంలో చోటు చేసుకుంది. మావోయిస్టులు పెట్టిన బాంబు పేలుడు వల్ల ఒక జర్నలిస్ట్ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. మావోయిస్టుల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని భద్రతా దళాలు ఎంతగానో ప్రయత్నాలు చేస్తున్నాయి.

ఒరిస్సా రాష్ట్రంలో కలహండి జిల్లాలో ఇటీవల వ్యక్తులు భద్రతా దళాల కోసం అమర్చిన బాంబు పేలి ఒక జర్నలిస్ట్ మృతి చెందాడు.కలహండి జిల్లాలో జరగబోయే పంచాయితీ ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టు దళాలు పిలుపునిచ్చాయి. దీనికి సంబంధించి జిల్లాలోని చుట్టుపక్కల గ్రామాలలో బ్యానర్లు, పోస్టర్లు లను మావోయిస్టులు ఏర్పాటు చేశారు. ఓ ప్రముఖ పత్రికలో జర్నలిస్టు, ఫొటోగ్రాఫర్‌గా రోహిత్ కుమార్ బిస్వాల్ పనిచేస్తున్నాడు. దోమ్‌కర్లకుంటా గ్రామం వద్ద ఓ చెట్టుకు మావోయిస్టులు అతికించిన పోస్టర్లు, బ్యానర్లను రోహిత్ కుమార్ పరిశీలిస్తున్న సమయంలో అక్కడ పాతిపెట్టిన ఐఈడీ బాంబు పేలడంతో రోహిత్‌ అక్కడికక్కడే ప్రాణాలుకోల్పోయాడు.

భద్రతా సిబ్బందిని టార్గెట్ చేసిన మావోయిస్టుల వారికోసం ఈ బాంబులను అమర్చినట్టు పోలీసులు వెల్లడించారు. ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌
రోహిత్ కుమార్ మృతి పట్ల సంతాపం తెలియచేసి రోహిత్ కుటుంబానికి రూ13 లక్షల నష్ట పరిహారం ప్రకటించారు. ఇదిలఉండగా ఒడిశా యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ సంఘం మావోయిస్టుల చర్యను తీవ్రంగా ఖండిస్తున్నారు. మావోయిస్టుల సంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో జర్నలిస్టులకు పటిష్టమైన భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.