షర్మిల ‘అబ్బే అదేమీ లేదు’ అంటూ ఇచ్చిన లెటర్లో అతిపెద్ద తిరకాసు ?

Many doubts on Sharmila's letter 
వైఎస్ జగన్ సోదరి షర్మిల తెలంగాణలో కొత్త పొలిటికల్ పార్టీ పెట్టబోతున్నారని చాలారోజుల నుండి వార్తలు వస్తూనే ఉన్నాయి.  షర్మిలకు, జగన్ కు నడుమ పొరపచ్చాలు పెరిగాయని, కుటుంబ కలహాలు ఉన్నాయని ప్రచారం నడిచింది.  జగన్ జైలులో ఉండగా పార్టీ బాధ్యతలను భుజానవేసుకున్న షర్మిల జగన్  బయటకు రాగానే ఒక్కసారిగా లైమ్ లైట్లో లేకుండా పోవడం అనేది ఈ అనుమాలంటికీ తావిచ్చింది.  ప్రత్యర్థి పార్టీలు కూడ ఇదే విషయాన్ని నొక్కి నొక్కి చెప్పారు.  ఈ క్రమంలోనే షర్మిల కొత్త పార్టీ పుకార్లు పుట్టుకొచ్చాయి.  దానికితోడు తెలంగాణలోని పలువురు నేతలు సైతం షర్మిల పార్టీ వార్తలపై స్పందించారు కానీ ఖండించలేదు. 
Many doubts on Sharmila's letter 
Many doubts on Sharmila’s letter
దీంతో షర్మిల స్పందించి ‘ఆదివారం నాడు ఆంధ్రజ్యోతి పత్రికలో బ్యానర్‌ ఐటమ్‌గా వచ్చిన వార్త నా దృష్టికి ఆలస్యంగా వచ్చింది.  వైఎస్సార్‌గారి కుటుంబాన్ని టార్గెట్‌ చేసి దురుద్దేశంతో రాసిన రాతలను తీవ్రంగా ఖండిస్తున్నాను.  ఏ పత్రిక అయినా, ఏ చానల్‌ అయినా ఓ కుటుంబానికి సంబంధించిన విషయాలను రాయటమే తప్పు.  అది నీతిమాలిన చర్య.  అటువంటి తప్పుడు రాతలు రాసిన పత్రిక, చానల్‌ మీద న్యాయపరమైన చర్యలకు వెనకాడబోమని తెలియజేస్తున్నా’ అన్నారు.  ఈ లేఖలో ఖండనతో పాటే నిగూఢార్థాలు కూడ ఉన్నాయని అంటున్నారు కొందరు.  లేఖలో షర్మిల వ్యాఖ్యలను డీకోడ్ చేసే ప్రయత్నం కూడ చేస్తున్నారు. 
 
నిజానికి ఆంధ్రజ్యోతిలో ఆదివారం ఉదయం కథనం వచ్చింది.  రాష్ట్రం మొత్తం సంచలనం అయిన ఈ సంగతి సోమవారం సాయంత్రానికిగానీ షర్మిల దృష్టికి వెళ్ళలేదు అంటే నమ్మశక్యంగా లేదని అంటున్నారు.  లేఖలో తనకు, అన్నకు విబేధాలు లేవని చెప్పలేదు.  కుటుంబ విషయాలను ప్రస్తావించడం దురుద్దేశమే అన్నారు కానీ అవి అబద్దాలను, అవాస్తవాలని అనలేదు.  మామూలుగా ఆంధ్రజ్యోతి లాంటి ప్రత్యర్థి పత్రిక మీద కేసులు పెట్టే  అవకాశమే వస్తే వైయస్ కుటుంబం ఊరుకుంటుందా, కేసులు పెట్టకుండా ఉంటుందా.  గతంలో ఇలానే తప్పుడు ప్రచారాలు జరిగితే షర్మిల నేరుగా పోలీస్ పెద్దలను కలిసి కంప్లైంట్ చేశారు.  ఆ దెబ్బతో ఆ ఫేక్ ప్రచారాలు ఆగిపోయాయి.  అప్పుడు చేసినట్టు ఇప్పుడెందుకు చెయ్యట్లేదు.  అంటే ఇక్కడే మతలబు ఏదైనా  ఉందేమో అంటూ కొత్త దారుల్లో ఆలోచిస్తున్నారు.