Manchu Vishnu: యూనివర్సిటీ డబ్బు మొత్తం సినిమాలలో పాడు చేస్తున్నారా… మంచు విష్ణు దిమ్మతిరిగే సమాధానం?

Manchu Vishnu: మంచు విష్ణు తన డ్రీం ప్రాజెక్టు కన్నప్ప సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా జూన్ 27వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగంగా నిర్వహిస్తున్నారు. ఇక ఈ సినిమా ఒకేసారి ఐదు భాషలలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ సినిమాలో ఇతర భాష సెలబ్రిటీలు కూడా భాగమయ్యారు. ఇక ఈ సినిమా సుమారు 200 కోట్లకు పైగా బడ్జెట్ తోనే తెరకెక్కిందని తెలుస్తోంది ఇక ఈ సినిమాని స్వయంగా మోహన్ బాబు నిర్మాణంలో తెరకెక్కించారు.

ఇలా ఈ సినిమా జూన్ 27వ తేదీ రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా మంచు విష్ణు వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఒక ఊహించని ప్రశ్న ఎదురయింది. ఇటీవల కాలంలో మంచు విష్ణు పెద్దగా సినిమాలు చేస్తూ సక్సెస్ అందుకోలేదు అయినప్పటికీ ఆయన తన సొంత నిర్మాణంలో ఇలా వందల కోట్ల బడ్జెట్ సినిమాలు చేయటానికి డబ్బు ఎక్కడిది యూనివర్సిటీ డబ్బు మొత్తం ఇలా సినిమాల కోసం వేస్ట్ చేస్తున్నారా? అని ప్రతి ఒక్కరూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు దీనికి మీ సమాధానం ఏంటి అనే ప్రశ్న ఎదురైంది.

ఈ ప్రశ్నకు మంచు విష్ణు సమాధానం చెబుతూ… నేను నా బ్యానర్ లో రెండు సినిమాలు మాత్రమే చేశాను అంతకుముందు ఇతర బ్యానర్స్ లోనే సినిమాలు చేస్తూ డబ్బు సంపాదించాము. ఇక యూనివర్సిటీ డబ్బులు పాడు చేస్తున్నాను అనడం సరైంది కాదని తెలిపారు. మేము యూనివర్సిటీలో డబ్బులు ఖర్చు చేసిన సినిమా కోసమే ఖర్చు చేస్తున్నాం అంటే సినిమా కోసం పనిచేసే కార్మికుల కోసమే ఖర్చు చేస్తున్నాము అలాంటప్పుడు పాడు చేయడం ఎలా అవుతుంది అంటూ ప్రశ్నించారు. అంతేకాకుండా శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థలన్నీ ఒక ట్రస్ట్ కింద నడుస్తున్నాయని ఆ ట్రస్ట్ కి సంబంధించిన డబ్బులను రూపాయి కూడా పక్కకు మళ్ళించడానికి వీలు లేదు. అలా చేస్తే నన్ను ఎత్తి బొక్కలో వేసి ఏడూర్లు తిప్పిస్తారు అంటూ విష్ణు కాస్త ఘాటుగా సమాధానం ఇచ్చారు. దీంతో యూనివర్సిటీ డబ్బులు సినిమాలకు వాడలేదని, తన సొంత డబ్బులతోనే సినిమాలు చేస్తున్నట్లు విష్ణు చెప్పకనే చెప్పేసారు.