Manchu Vishnu: టాలీవుడ్ హీరో మంచు విష్ణు నటించిన లేటెస్ట్ మూవీ కన్నప్ప. ఈ సినిమాలో చాలామంది పాన్ ఇండియా స్టార్స్ నటించిన విషయం తెలిసిందే. మంచు విష్ణు హీరో కాగా.. ప్రభాస్, మోహన్ లాల్, మోహన్ బాబు, కాజల్ తదితర స్టార్స్ ఇందులో నటించారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. దానికి తోడు ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల అయిన అప్డేట్లు సినిమాపై అంచనాలను భారీగా పెంచేసాయి. కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా ఈ నెల 27న థియేటర్లలో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ కార్యక్రమాలలో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు మూవీ మేకర్స్.
ముఖ్యంగా మంచు విష్ణు వరుసగా ఇంటర్వ్యూలకు హాజరవుతూ సినిమాలకు సంబంధించిన విషయాలను పంచుకుంటున్నారు. ఇందులో భాగంగానే హార్డ్ డిస్క్ మిస్ అవ్వడం గురించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో కన్నప్ప సినిమా బడ్జెట్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. కన్నప్ప సినిమా బడ్జెట్ ఎంత అయ్యింది అని యాంకర్ ప్రశ్నించగా దీనికి మంచు విష్ణు స్పందిస్తూ.. కచ్చితంగా మూడంకెల ఖర్చు అయిందని విష్ణు చెప్పుకొచ్చాడు.
అయితే రూ.100 కోట్లు అయిందా? రూ.200 కోట్లు అయిందా? అని మరోసారి అడగ్గా.. ఈ ఏడాది ఇప్పటికే రిలీజైన చిత్రాల కంటే తమ కన్నప్ప సినిమాకి ఎక్కువ అని తెలిపారు విష్ణు. అలాగే ఈ ఏడాదిలోనే విడుదలయ్యే పవన్ కల్యాణ్ ఓజీ కంటే తమ మూవీ బడ్జెట్ ఎక్కువని క్లారిటీ ఇచ్చాడు. ఎంతో చెబితే ఐటీ వాళ్లు తన ఆఫీస్‌కి వస్తారు? ఎందుకు ఈ గొడవ? అని విష్ణు చెప్పుకొచ్చాడు. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే విడుదల సమయం దగ్గర పడుతున్న కొద్ది మూవీ మేకర్స్ ప్రమోషన్స్ ని పెంచడంతో పాటు సినిమా గురించి చేస్తున్న వాఖ్యలు సినిమాపై అంచనాలను భారీగా పెంచేస్తున్నాయి.