Kannappa Trailer: విడుదలైన కన్నప్ప మూవీ ట్రైలర్.. వీడియో వైరల్!

Kannappa Trailer: టాలీవుడ్ హీరో మంచు విష్ణు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ కన్నప్ప. ఇటీవలె ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన విషయం తెలిసిందే. గత కొద్ది రోజులుగా ఈ సినిమా పేరు సోషల్ మీడియాలో మారుమోగుతోంది. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కిన ఈ మూవీపై ఇప్పటికే భారీగా అంచనాలు నెల కొన్నాయి. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ప్రతిస్టాత్మికంగా తెరకెక్కించారు మోహన్ బాబు. కాగా ఇందులో విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తుండగా అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ లాల్, మధుబాల, కాజల్ వంటీ వారు కీలకపాత్రల్లో నటిస్తున్నారు.

ఈ చిత్రానికి మహాభారతం సీరియల్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఈ నెల 27వ తేదీన విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన అప్డేట్లు అంచనాలను భారీగా పెంచేసాయి. ఇది ఇలా ఉంటే విష్ణు అభిమానులు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చేసింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్ర బృందం. తాజాగా విడుదలైన ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది.

Kannappa Official Trailer- Telugu | Vishnu Manchu | Mohan Babu | Prabhas | Mohanlal | Akshay Kumar

ఇందులో తిన్నడు పాత్రలో విష్ణు, రుద్ర పాత్రలో ప్రభాస్, శివుడిగా అక్షయ్ కుమార్ పాత్రల్లో కనిపించారు. ట్రైలర్ చూస్తుంటే విజువల్స్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మరింత హైప్ క్రియేట్ చేశాయి. ఇక ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ గురించి చెప్పక్కర్లేదు. ఇప్పుటి వరకు విడుదలైన పోస్టర్స్ కంటే ట్రైలర్ తోనే మరింత అంచనాలు పెంచేశారు మూవీ మేకర్స్. మంచు విష్ణు, ప్రభాస్ మధ్య వచ్చే సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.