Manchu Vishnu: వరుసగా ప్లాప్ సినిమాలు ఇచ్చి వారిని పోగొట్టుకున్నాను.. ఫాన్స్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన విష్ణు!

Manchu Vishnu: టాలీవుడ్ హీరో మంచు విష్ణు నటించిన లేటెస్ట్ సినిమా కన్నప్ప. ఇప్పటికే షూటింగ్ ని పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమాలో మంచు విష్ణు తో పాటు ప్రభాస్, మోహన్ లాల్, మోహన్ బాబు, అక్షయ్ కుమార్, కాజల్ లాంటి స్టార్స్ నటించారు. ఈ సినిమా మంచు విష్ణు డ్రీం ప్రాజెక్టుగా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల అయిన అప్డేట్లు సినిమాపై అంచనాలను భారీగా పెంచేసాయి.

దానికి తోడు స్టార్ సెలబ్రిటీలు ఇందులో నటించడంతో ఈ సినిమా పై అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమా కోసం ఎంతో ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఇకపోతే కన్నప్ప సినిమాకు సంబంధించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వినిపిస్తున్న విషయం తెలిసిందే. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో మూవీ మేకర్స్ ప్రమోషన్స్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. అందులో భాగంగానే హీరో మంచు విష్ణు ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు.. సినిమాకు సంబంధించిన విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటున్నారు హీరో మంచు విష్ణు.

తాజాగా ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని గుంటూరులో ఘనంగా నిర్వహించారు మూవీ మేకర్స్. ఆ సంగతి పక్కన పెడితే హీరో మంచు విష్ణు తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా అభిమానుల గురించి మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు మంచు విష్ణు. ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ.. నాన్న గారికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఒకప్పుడు నాకు కూడా ఫ్యాన్స్ ఉన్నారు. కానీ నేను వరుసగా ఫ్లాప్ సినిమాలు ఇచ్చి ఫ్యాన్స్ ని పోగొట్టుకున్నాను. కన్నప్ప తర్వాత మళ్ళీ నాకు ఫ్యాన్స్ పెరుగుతారు. మనం రెగ్యులర్ గా మంచి సినిమాలు ఇచ్చి ఫ్యాన్స్ ని సంతృప్తి పరచాలి. లేకపోతే ఈ రోజుల్లో ఫ్యాన్స్ వేరే హీరోలకు షిఫ్ట్ అయిపోతారు. ఫ్యాన్స్ వాళ్ళ డబ్బులు, టైం, ఆలోచనలు మన మీద పెడతారు కాబట్టి వాళ్ళని మన సినిమాలతో మెప్పించాలి. లేకపోతే వాళ్ళని మెప్పించే హీరోలకు ఫ్యాన్స్ గా మారతారు అని తెలిపారు మంచు విష్ణు. ఈ సందర్భంగా మంచు విష్ణు చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.