“జిన్నా” విషయంలో టెన్షన్ గా ఉన్న విష్ణు మంచు.!

టాలీవుడ్ లో ఉన్న పలు స్టార్ కుటుంబాల్లో మంచు వారి కుటుంబం కూడా ఒకటి. మరి వీరి కుటుంబం యంగ్ హీరో మంచు విష్ణు నటించిన తాజా చిత్రం “జిన్నా” కోసం అందరికీ తెలిసిందే. మొదట పాన్ ఇండియా సినిమాగా అనౌన్స్ చేసి తీరా ఎవరూ సినిమాని పట్టించుకోకపోయేసరికి మళ్ళీ తెలుగు రిలీజ్ తోనే అదృష్టం పరీక్షించుకోడానికి వచ్చాడు.

అయితే ఈ చిత్రంపై గట్టి నమ్మకం పెట్టుకున్న తాను ఈ సినిమా ఫలితం విషయంలో చాలా టెన్షన్ గా ఉన్నట్టు చెప్తున్నాడు. ఈరోజు జిన్నా విడుదల కాబోతుండడంతో జిన్నా జిన్నా జిన్నా అంటూ ఫింగర్స్ క్రాస్ చేసి రిజల్ట్ కోసం చూస్తున్నాయని సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు.

మొత్తానికి అయితే ఈ సినిమా విషయంలో తాను చాలా నమ్మకం పెట్టుకున్నట్టే కనిపిస్తున్నాడు. మరి ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుందో అని చూడాలి. ఇంకా ఈ సినిమాలో పోర్న్ స్టార్ సన్నీ లియోన్ ఓ కీలక పాత్ర చేయగా..

మరో హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటించింది. అలాగే కొత్త దర్శకుడు సూర్య అయితే దర్శకత్వం వహించగా అనూప్ సంగీతం అందించాడు. అసలు మరి ఈ సినిమా విష్ణు నమ్మకాన్ని నిలబెట్టిందా లేదా అని చూడాలి.