Manchu Vishnu: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టు కన్నప్ప సినిమా జూన్ 27 వ తేదీ విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా మంచు విష్ణు నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ తో కలిసి ఒక ఇంటర్వ్యూ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా మంచు విష్ణు కన్నప్ప సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు. కన్నప్ప సినిమాని తాను గత పది సంవత్సరాలుగా మోస్తున్నానని తెలిపారు. ఈ సినిమా కోసం ఎన్నో రీసర్చ్ చేసి సినిమాని మొదలు పెట్టామని తెలిపారు. ఈ సినిమా షూటింగ్ మొదలైన తర్వాత ప్రతి ఒక్క సీన్ ఒకటికి పది సార్లు చెక్ చేసుకుని మన చరిత్ర ఎక్కడా కూడా మిస్ కాకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ చేశామని తెలిపారు.
ఈ సినిమా షూటింగ్ సమయంలో నాన్నగారి సలహాలు ఎక్కువగా తీసుకున్నాము ఇక నాన్న సలహా మేరకే డైరెక్టర్ ముకేశ్ కుమార్ ను తీసుకున్నామని వెల్లడించారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్, నాన్న మధ్య ఒక అద్భుతమైన సన్నివేశం వస్తుంది ఆ సన్నివేశం ఎప్పటికీ మర్చిపోలేనిదని తెలిపారు. కన్నప్ప సినిమా విషయంలో నేను అతిపెద్ద తప్పు చేశానని మంచు విష్ణు ఈ సందర్భంగా బయటపెట్టారు.
ఈ సినిమా విఎఫ్ఎక్స్ కోసం పూర్తి స్థాయి పరిణతి లేని ఓ వ్యక్తిని తీసుకున్నాం. అదే నేను చేసిన అతిపెద్ద తప్పు. ఆ వ్యక్తి కారణంగానే సినిమా ఇంత ఆలస్యమైందని తెలిపారు. ఇప్పటివరకు ఇలాంటి తప్పులను నేను ఎక్కడా చేయలేదు కానీ కన్నప్ప సినిమా విషయంలో ఆ తప్పు జరిగిపోయిందని ప్రస్తుతం అని క్లియర్గా ఉన్నాయని ఆ శివయ్య ఆజ్ఞతో ఈ సినిమా విడుదలకు సిద్ధం అవుతుంది అంటూ మంచు విష్ణు ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.