Manchu Lakshmi: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లలో కన్నప్ప సినిమా పేరు కూడా ఒకటి. గత కొద్ది రోజులుగా కన్నప్ప సినిమా పేరు సోషల్ మీడియాలో మారుమోగుతున్న విషయం తెలిసిందే. మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు హీరోగా నటించిన చిత్రం కన్నప్ప. ఈ సినిమాలో చాలామంది స్టార్ సెలబ్రిటీలు నటించడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ సినిమా కోసం ఎంతో ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఈ సినిమా ఈనెల 27వ తేదీన విడుదల కానున్న విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా మూవీ మేకర్స్ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన అప్డేట్లు కూడా సినిమాపై అంచనాలను పెంచేశాయి. హీరో మంచు మనోజ్ ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలలో యాక్టివ్గా పాల్గొంటూ సినిమాపై అంచనాలను పెంచేస్తున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా మంచు లక్ష్మి ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో భాగంగా మాట్లాడుతూ తాను కన్నప్ప సినిమాలో నటించకపోవడానికి గల కారణాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా మంచు లక్ష్మి మాట్లాడుతూ.. నన్ను ఎందుకు ఈ సినిమాలో తీసుకోలేదో మీరు విష్ణుని అడగాలి.
నేను నటిస్తే ఈ సినిమాలో నటించిన వారు ఎవరు కనిపించరు అని సరదాగా అన్నారు. ఇందులో నేను చేయగలిగే పాత్ర లేకపోవడంతోనే విష్ణు నాకు అవకాశం ఇవ్వలేదు. ఒకవేళ నేను చేయగలిగే పాత్ర ఉంటే ఇచ్చి ఉండేవాడేమో. మేమంతా కలిసి అన్ని చిత్రాల్లో నటిస్తే అది ఫ్యామిలీ సినిమా అవుతుంది అని మంచు లక్ష‍్మీ చెప్పుకొచ్చింది. మీ సోదరులకి.. మీ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందా? అనే ప్రశ్నకు బదులిస్తూ.. సినిమాల్లో అవకాశం ఇవ్వకపోవటానికి, సపోర్ట్ చేయకపోవడానికి సంబంధం లేదు. నా మద్దతు వాళ్లకు ఎప్పుడూ ఉంటుంది అని సమాధానం ఇచ్చింది.