Manchu Family Plan : ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు.. టాలీవుడ్ లో మీ పని మీదే మా పని మాదే అనే రీతిలో మంచు వారి ఫ్యామిలీ(ఒక్క మనోజ్ తప్ప) ఆశ్చర్యపరుస్తూనే ఉంటారు. ఒక్కోసారి అర్ధమే లేని కామెంట్స్ తో నెట్టింట్లో వైరల్ అవుతుంటారు. సరే ఇదంతా పక్కన పెడితే ఇటీవల మంచు మోహన్ బాబు వారి పెద్ద అబ్బాయి మంచు విష్ణు “మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్”(మా) ప్రెసిడెంట్ అయ్యాక ఇంక అసలు ఎవరూ ఆపలేకపోతున్నారు.
ఇంకా ఇండస్ట్రీ అంతా నాదే అన్న రేంజ్ లో మొన్న మీడియా ముందు ఇచ్చిన బిల్డప్ అయితే వేరే లెవెల్.. మరి ఇదిలా ఉంటే మరోపక్క టాలీవుడ్ లో నెలకొన్న టికెట్ ధరల సమస్యపై మెగాస్టార్ చిరంజీవి తనని తాను తగ్గించుకొని ఏపీ సీఎం జగన్ మంత్రి పేర్ని నానీలను కలసి సమస్యకు ఫైనల్ గా పరిష్కారం తెచ్చుకున్నారు.
మరి తాము కూడా ఏదోకటి చెయ్యాలని ఆ మీటింగ్ కి కౌంటర్ ఇస్తున్నట్టుగా తాము వెళ్లకుండా మంత్రి పేర్ని నాని ని తమ ఇంటికి రప్పించుకొని అందరికీ షాకిచ్చారు మంచు వారు. అయితే ఇదంతా ప్లాన్ ప్రకారం జరుగుతుందా మంత్రి హైదరాబాద్ వచ్చేలా ఉంటే ముందు రోజు అంతమంది స్టార్స్ ని ఇబ్బంది పెట్టి పిలిపించడం ఎందుకు అని కామెంట్స్ కూడా వినిపించాయి.
కానీ ఇక్కడే మంచు వారి బిల్డప్ గాలిని పేర్ని నాని తీసేసారు. మోహన్ బాబు గారి ఇంటికి నేనేమీ కావాలని వెళ్ళలేదు అని వారు నన్ను వారి ఇంటికి ఆస్వనించారు కాబట్టే వెళ్లాను అని క్లారిటీ ఇచ్చారు. దీనితో మేము ఇంట్లోనే ఉండి ఏపీ మంత్రులని వారంత వారే వచ్చినట్టు మేము చేసుకున్నామనే మంచు వారి ప్రొజెక్షన్ బొక్క బోర్లా పడ్డట్టు అయ్యింది. ఏది ఏమైనప్పటికీ వీరి అతితో మాత్రం నెటిజన్స్ విస్తు పోతున్నారు.