Women-Uncle: ఉత్తరాఖండ్ లోని ఉధమ్ సింగ్ నగర్ జిల్లా సితార్‌గంజ్ పట్టణంలో 18 ఏళ్ల బాలికను 35 ఏళ్ల దుకాణదారుడు ‘అంకుల్’ అని పలిచినందుకు దారుణంగా కొట్టాడు. బాలిక తలకు గాయం కావడంతో ఆసుపత్రిలో చేర్పించారు. ఇప్పుడు ఆమె ఆక్సిజన్ సపోర్టుతో చికిత్స పొందుతోంది.
దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. మన కంటే పెద్ద వారు ఎవరైనా ఉంటే.. బాగా తెలిసిన వాళ్లయిదే ఏదో ఒక రిలేషన్ తో పిలుస్తాం.. లేదంటే.. మర్యాదపూర్వకంగా అంకుల్ , ఆంటీ అంటూ పిలుస్తుంటాం. వాళ్లు కూడా మన వయస్సును బట్టి మర్యాదు ఇస్తుంటారు. కానీ కొంతమందికి అంకుల్ అని పిలిపించుకోవడం అస్సలు ఇష్టం ఉండదు. అలా పిలుస్తున్నారంటే.. వాళ్లపై ఎక్కడలేని కోపాన్ని తెచ్చుకుంటారు. ఇలాంటి ఒక ఘటన ఉత్తరాఖాండ్ లో చోటు చేసుకుంది. ఉదమ్ సింగ్ నగర్ జిల్లాలో సితార్ గంజ్ కి చెందిన 18ఏళ్ల అమ్మాయి బ్యాడ్మింటన్ రాకెట్ ను కొనడానికి మోహిత్ కుమార్ అనే వ్యక్తి షాప్‌కి వెళ్లింది. ఆ షాప్ లో అతడు తన పని తాను చేసుకుంటూ.. షాప్ లో ఉన్న వస్తువలును విక్రియిస్తూ బిజీగా ఉన్నాడు.
అదే సమయంలో ఆమె అక్కడకు చేరుకుంది. అంకుల్ నాకు బ్యాడ్మింటన్ రాకెట్ కావాలి.. ఒకటి ఇవ్వండి అంటూ అడిగింది. దీంతో అతడికి ఎక్కడ లేని కోపం వచ్చింది.. ఆ బాలిక రాకెట్ అడిగినందుకు కాదు.. అంకుల్ అని సంభోదించినందుకు. అంతే ఇక షాప్ నుంచి బయటకు వచ్చి.. చేయి పట్టి లాగి అక్కడే చితకబాదాడు. ఆ బాలిక ఎంత అరిచినా వినిపించుకోకుండా.. ఇష్టం వచ్చినట్లు బాదాడు. ఆ దెబ్బలకు ఆ బాలిక అక్కడే పడిపోయింది. స్థానికులు ఆ బాలికను ఆసుపత్రికి తరలించారు. తీవ్రమైన గాయాలు కావడంతో ఆ బాలికకు ఆక్సిజన్ అందిస్తూ.. చికిత్స ఇస్తున్నారు. ప్రస్తుతం ఆ బాలిక పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయంగా దుకాణదారుపై IPC సెక్షన్ 323 (స్వచ్ఛందంగా గాయపరచడం), 354 ( ఒక మహిళపై దాడి చేయడం), 506 (నేరపూరిత బెదిరింపు) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.