ఆలయంలో దొంగతనం చేస్తే సంతానం ప్రసాదించే దేవుడు..?

మన భారతీయ సంస్కృతిలో వివిధ రకాల ఆచార సాంప్రదాయాలు ఉన్నాయి. వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు వివిధ రకాల సాంప్రదాయాలను పాటిస్తూ ఉంటారు. అలాగే వారి సాంప్రదాయాలకు అనుగుణంగా ఆలయాలు నిర్మించి దేవుళ్లను పూజిస్తూ ఉంటారు. ఇలా దేశవ్యాప్తంగా ఎన్నో పురాతన దేవాలయాలు ఉన్నాయి. ఇలాంటి ఒక్కొక్క దేవాలయానికి ఒక్కో రకమైన ఆచార సంప్రదాయాలు ఉంటాయి. ప్రజలు ప్రతిరోజు ఆలయానికి వెళ్లి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ. అంతేకానీ ఏ భక్తుడు కూడా ఆలయానికి వెళ్లి దొంగతనం చేయాలని అనుకోరు. కానీ ఈ దేవాలయానికి వెళ్లిన భక్తులు దొంగతనం కచ్చితంగా చేయాలి.ఎందుకంటె ఇది ఈ గుడి సాంప్రదాయం.

ఈ ఆలయంలో దొంగతనం చేస్తేనే అమ్మవారి అనుగ్రహం పొందుతారు. భక్తులు కోరుకున్న కోరికలు నెరవేరాలంటే తప్పకుండా దొంగతనం చేయాలి. ఇంతకీ ఈ దేవాలయం ఎక్కడ ఉందో పూర్తీ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఉత్తరఖండ్ లోని చూడియాల గ్రామంలోని చూడామణి అమ్మ వారి దేవాలయం ఉంది. పురాతన కాలానికి చెందిన ఈ ఆలయంలో అమ్మవారు కొలువై ఉంటారు. ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయాన్ని దర్శిస్తే సంతానం లేని వారికి పిల్లలు పుడతారని అక్కడి ప్రజలు బలంగా నమ్ముతారు. అందువల్ల సుదూర ప్రాంతాల నుండి కూడా భక్తులు ఈ ఆలయానికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటారు.

ఈ దేవాలయాన్ని దర్శించిన ఎంతోమంది భక్తులకు సంతానం కలిగినట్లు ఇక్కడి స్థానికులు చెబుతున్నారు. సంతానం లేక బాధపడుతున్న దంపతులు ఈ ఆలయానికి వెళ్లి అమ్మవారి పాదాల దగ్గర ఉండే చెక్క బొమ్మను దొంగతనం చేయాలి. ఇలా చేస్తే వారికి సంతానం కలుగుతుంది. ఆ తర్వాత వారికి సంతానం కలిగితే మళ్లీ ఆ బొమ్మను అమ్మవారి పాదాల దగ్గర ఉంచి మొక్కు తీర్చుకోవాలి.ఇలా చేయడం వల్ల సంతానం కలుగుతుందని అక్కడి స్థానిక ప్రజలు చెబుతున్నారు. ఈ ఆచారం ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతుందని కూడా అక్కడి ఆలయ పూజారులు చెబుతున్నారు. అందువల్ల సంతానం లేక బాధపడుతున్న ఎంతోమంది భక్తులు ఈ ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి పాదాల వద్ద ఉన్న చెక్క బొమ్మను దొంగతనం చేస్తుంటారు.