సుడిగాలి సుధీర్ గెటప్ శీను గురించి ఆ విధంగా క్లారిటీ ఇచ్చిన మల్లెమాల!

మల్లెమాల వారు గత కొన్ని సంవత్సరాల నుంచి బుల్లితెరపై ప్రసారం చేస్తున్నటువంటి కార్యక్రమాలకు విపరీతమైన క్రేజ్ ఉందని చెప్పాలి. ఇలా మల్లెమాల వారి నిర్వహణలో జబర్దస్త్ కార్యక్రమానికి విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఇకపోతే మల్లెమాల వారు ఎప్పుడూ కూడా కార్యక్రమాన్ని ట్రెండింగ్ లో ఉన్న కామెడీ స్కిట్ లతో బాగా రేటింగ్స్ సంపాదించుకోవడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు.అదేవిధంగా తమపై ఎలాంటి ఆరోపణలు వచ్చిన తిప్పికొట్టడానికి కూడా మల్లెమాల ముందు వరుసలో ఉంటుంది.

అయితే గత కొంత కాలం నుంచి సుడిగాలి సుదీర్ టీం జబర్దస్త్ కార్యక్రమంలో కనపడకపోవడంతో మల్లెమాల తీవ్రస్థాయిలో ఆరోపణలు వచ్చాయి. మల్లెమాల వారు వీళ్లను పొమ్మనలేక పొగ పెట్టారని, వీరితో గొడవల కారణంగానే సుడిగాలి సుదీర్ టీం ఈ కార్యక్రమం నుంచి తప్పుకుంటున్నారు అంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. అయితే సుడిగాలి సుదీర్ టీం వెళ్లిపోవడానికి మల్లెమాల వరకు ఎలాంటి సంబంధం లేదు అనే విషయాన్ని మల్లెమాల వారు స్కిట్ ద్వారా చెప్పకనే చెప్పేశారు.

తాజాగా విడుదలైన జబర్దస్త్ కార్యక్రమానికి సంబంధించిన ప్రమోలో భాగంగా రాకింగ్ రాకేష్ వేసిన స్కిట్ చూస్తే ఎవ్వరైనా ఎమోషనల్ అవ్వాల్సిందే. ఈ సందర్భంగా రాకింగ్ రాకేష్ స్కిట్ ద్వారా సుధీర్ టీం వెళ్లిపోవడానికి మల్లెమాల వారికి ఎలాంటి సంబంధం లేదని కేవలం సినిమా అవకాశాలు రావడం వల్లే వాళ్ళు వెళ్లిపోయారని, తిరిగి ఎప్పుడైనా ఈ కార్యక్రమంలోకి వస్తారు అంటూ మల్లెమాల రాకింగ్ రాకింగ్ రాకేష్ వేసిన స్కిట్ ద్వారా ఈ ముగ్గురు జబర్దస్త్ కార్యక్రమం నుంచి వెళ్లి పోవడానికి కారణం ఏంటో క్లారిటీగా చెప్పేశారు.