Prabhas: మారుతి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ది రాజా సాబ్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్గా పరిచయం కాబోతున్నారు నటి మాళవిక మోహన్. నిజానికి ఈ సినిమా ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కొన్ని కారణాలవల్ల వాయిదా పడుతూ వస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.
ఇక ఈ సినిమాలో హీరోయిన్గా మాళవిక మోహన్ కూడా అవకాశం అందుకున్నారు. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే మాలవిక మోహన్ నిత్యం ఈ సినిమా విశేషాలు గురించి అలాగే ప్రభాస్ గురించి కూడా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఈమె ప్రభాస్ గురించి మరొక ఆసక్తికరమైన విషయాన్ని బయట పెట్టారు. రాజా సాబ్ సినిమా కారణంగా తాను ప్రభాస్ గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నానని తెలిపారు.
తాను ప్రభాస్ ను కలవకముందు పలు ఇంటర్వ్యూలలో ఆయనని చూసినప్పుడు నాకు ఒకటే అనిపించేది ప్రభాస్ చాలా సైలెంట్ ఎవరితోనూ మాట్లాడరని అనుకునేదాన్ని. కానీ ఈ సినిమాలో ప్రభాస్ తో నటించిన తర్వాత తన విషయంలో నా ఆలోచన పూర్తిగా తప్పు అని తెలుసుకున్నాను అంటూ మాళవిక వెల్లడించారు. ప్రభాస్ అనుకున్నంత సైలెంట్ కాదు ఆయన షూటింగ్ లొకేషన్లో ఉన్నారు అంటే అక్కడ ఒక డల్ మూమెంట్ కూడా ఉండదు.
అందరితో చాలా సరదాగా నవ్వుతూ మాట్లాడుతుంటారు. ప్రభాస్ గారు సినిమా షూటింగ్ లొకేషన్ లో ఉంటే ఎవరికి ఇబ్బంది ఉండదని ఎవరు బోర్ ఫీల్ అవ్వరని తెలిపారు. నిజానికి ప్రభాస్ బయట ఎక్కడ ఎవరితో కలవడానికి ఇష్టపడరు కానీ సినిమా షూటింగ్ సమయంలో మాత్రం అక్కడున్న వారందరూ కూడా తనవారే అని భావించి అందరితో చాలా సరదాగా గడుపుతూ ఉంటారు. ఇక ప్రభాస్ ఆ చిత్ర బృందానికి అందించే ఫుడ్డు గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పాలి.