Malaivka Mohanan : సీనియర్ హీరోకి నో చెప్పిన మాళవిక మోహనన్

Malaivka Mohanan : మాళవికా మోహనన్.. ఈ అమ్మడు తెలుగులో స్ర్టెయిట్ హీరోయిన్‌గా ఇంకా పరిచయం కాలేదు. కానీ, తమిళంలో రెండు పెద్ద సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ‘మాస్టర్’ సినిమాలో మాళవిక హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే.

అలాగే, ఇటీవల ధనుష్ హీరోగా వచ్చిన ‘మారన్’ సినిమాలోనూ ఈ ముద్దుగుమ్మే హీరోయిన్. కాగా, టాలీవుడ్‌కి ఈ భామ ఎప్పుడో పరిచయం కావల్సి వుంది. అప్పుడెప్పుడో విజయ్ దేవరకొండ హీరోగా ‘హీరో’ అను సినిమా రూపొందాల్సి వుంది. కానీ, కొన్ని కారణాలతో ఆ సినిమా ఆగిపోయింది.

ఆ సినిమాలో హీరోయిన్‌గా మాళవికనే ఎంచుకున్నారు. సినిమా ఆగిపోవడంతో ఈ ముద్దుగుమ్మ తెరంగేట్రానికి బ్రేకులు పడ్డాయ్. తమిళ డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మాళవిక మోహనన్ త్వరలో రెండు తెలుగు సినిమాలతోనూ ప్రేక్షకుల్ని పలకరించనుంది.క

అయితే, తాజా అప్‌డేట్ ఏంటంటే, తెలుగులో ఓ స్టార్ హీరోతో మాళవికకి ఛాన్స్ వచ్చిందట. ఎందుకో తెలీదు. కానీ, ఆ ఛాన్స్ మాళవిక వదులుకుందని తెలుస్తోంది. తమిళంలో స్టార్ హీరోల సరసన ఛాన్సుల్ని సద్వినియోగం చేసుకున్న మాళవికా మోహనన్, తెలుగులోనూ అలాంటి బంపర్ ఆఫరే వస్తే, కాదనడం ఏంటని ఆమె అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారట.

ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరు.? ఆ స్టార్ హీరోకి మాళవిక నో చెప్పడానికి అంత బలమైన కారణాలేంటీ.? అనేవి తెలియాల్సి వుంది. అన్నట్లు మాళవిక తమిళంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘పేటా’ సినిమాలోనూ నటించింది.