భారత దేశంలో అత్యంత వేగంగా విస్తరించిన అతి పెద్ద ఆభరణాల వ్యాపార సంస్థల్లో ఒకటైన మలబార్ గోల్డ్ & డైమండ్స్, తిరిగి తెలంగాణ రాష్ట్రంలో తమ షోరూములను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. వినియోగదారులు మరియు సిబ్బంది యొక్క ఆరోగ్యం సంరక్షణ దృష్టిలో పెట్టుకుని స్థానిక ప్రభుత్వాలు జారీ చేసిన మార్గదర్శకాలు తప్పనిసరిగా పాటిస్తు యధావిధిగా కార్యకలాపా లు జరుగుతాయని తెలిపారు. షోరూమ్ పరిసరాలు, కుర్చీలు, తలుపులు, స్వైపింగ్ మెషిన్లు మొదలగు వాటిని శానిటైజ్ చేస్తున్నట్లు మేనేజ్ మెంట్ తెలిపింది. వినియోగదారుల కోసం తయారు చేసిన ఆభరణాలను శానిటైజ్ చేస్తున్నామన్నారు.
సామాజిక్ దూరం, నిబంధనల ప్రకారం కస్టమర్స్ కోస్ం తగినంత దూరం పాటించేలా మార్కర్ తో మార్కింగ్ చేసామన్నారు. తద్వారా వినియోగదారులు ఒకిరికొకరు తగినంత దూరం పాటించడానికి వీలుంటుంది. వినియోగదారులు షోరూములో ప్రవేశించే సమయంలో ప్రవేశ ద్వారం వద్ద థర్మల్ స్ర్కీనింగ్ ఏర్పాటు చేసామన్నారు. లోపలికి ప్రవేశించే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నింటి పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని తెలిపారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలోని స్థానిక అధికారుల నుండి అవసరమైన ఆమోదాలు ,అనుమతులు పొందిన తర్వాతే షోరూమ్ తిరిగి ప్రారంభిస్తున్నట్లు సంస్థ అధినేతలు తెలిపారు.