Mahesh gave shocking : మన తెలుగు హీరోలు వెండితెరపై ఎంత ఓపెన్ అయ్యినా ఆఫ్ స్క్రీన్ లో మాత్రం చాలా సెటిల్డ్ గానే ఉంటారు. చాలా తక్కువ మాట్లాడుతూ చాలా తక్కువ చేష్టలు చేస్తూ ఉంటారు. వారిలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఒకరు. మహేష్ చాలా తక్కువగా మాట్లాడినా మాట్లాడే కొద్ది సేపు కూడా మంచి ఎనర్జిటిక్ గా ఉంటుంది. అయితే నిన్న మాత్రం మహేష్ అందరికీ ఒక మినీ షాక్ ఇచ్చాడని చెప్పాలి.
తాను నటించిన లేటెస్ట్ సినిమా “సర్కారు వారి పాట” సినిమా సూపర్ సక్సెస్ మీట్ కర్నూల్ లో గ్రాండ్ గా జరగగా ఈ ఈవెంట్ లో మాత్రం మహేష్ తన సినిమా సూపర్ హిట్ సాంగ్ మ మ మహేషా కి అదే స్టెప్పులు వేయడం ఆసక్తి గా మారిపోయింది. థమన్ స్టేజ్ పై పెర్ఫార్మ్ చేస్తుండగా వారు మహేష్ ని ఆహ్వానించగా మహేష్ కూడా స్టేజి మీదకు తన మాస్ స్టెప్పులు చేసాడు. దీనితో ఈ అనుకోని ట్రీట్ ఇవ్వడంతో అభిమానులు కూడా ఫుల్ కిక్ ఎంజాయ్ చేస్తున్నారు.
ఇలా మహేష్ మొట్ట మొదటిసారిగా స్టేజ్ పై డాన్స్ చెయ్యడం తో మొత్తానికి అయితే ఈ షాకింగ్ ట్రీట్ ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది. ఇంకా ఈ సినిమాకి పరశురాం పెట్ల దర్శకత్వం వహించిన ఈ సినిమాకి మైత్రి మూవీ మేకర్స్ 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ వారితో మహేష్ కూడా సంయుక్తంగా నిర్మించారు. అలాగే కీర్తి సురేష్ హీరోయిన్ గా ఈ సినిమాలో సూపర్ రోల్ చేసింది.