Mahavatar Narasimha: ఇటీవల కాలంలో ఎన్నో అద్భుతమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్న నిత్యం ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి అయితే తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఓ సినిమాని చూడటం కోసం పెద్ద ఎత్తున ప్రేక్షకులు థియేటర్లకు వెళ్ళటమే కాకుండా థియేటర్ ముందు చెప్పులు విప్పి లోపలికి వెళ్లి మరి సినిమా చూస్తుండటం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మరి ఇలా చెప్పులు విప్పి మరి చూస్తున్న ఆ సినిమా ఏంటి అనే విషయానికి వస్తే ఆ సినిమా మరేదో కాదు మహావతార్ నరసింహ అని చెప్పాలి.
ఇటీవలే విడుదలైన యానిమేటెడ్ మూవీ మహావతార్ నరసింహ. క్లీమ్ ప్రొడక్షన్స్, హోంబలే ఫిల్మ్స్ సంస్థలు సంయుక్తంగా ఈ ను తెరకెక్కించాయి. ఈ సినిమా ఈ నెల 25న విడుదలైంది.ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన మహావతార్ నరసింహ థియేటర్స్ లో దూసుకుపోతుంది. ప్రేక్షకులు ఈ చూడటానికి ప్రేక్షకుల ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసిన మహావతార్ నరసింహ గురించే మాట్లాడుతున్నారు. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు మొత్తం మహావతార్ నరసింహ సినిమాకు సంబంధించిన వీడియోలు కనబడుతున్నాయి.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతుంది. అయితే ఇందులో భాగంగా ప్రేక్షకులు అందరూ థియేటర్ బయట చెప్పులు వదిలి మరి సినిమా చూడటం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ప్రేక్షకులకు కేవలం సినిమా చూడటానికి థియేటర్ కి వెళ్లినట్టు కాకుండా గుడికి వెళుతున్న భావనతో థియేటర్ లోపలికి వెళ్తున్నారని తెలుస్తుంది.ఈవీడియోనే కాదు మహావతార్ నరసింహ థియేటర్ లో ప్రేక్షకులు భజనలు చేస్తున్న వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. కాగా మహా విష్ణువు దశావతారాల ఆధారంగా పదేళ్లపాటు వరుసగా రూపొందనున్నాయి. ‘మహావతార్’ టిక్ యూనివర్స్ పేరుతో మేకర్స్ ఏడాదికి ఓ సినిమా విడుదల చేయనున్నారు. ఇక మహావతార్ కలెక్షన్స్ పరంగాను రికార్డ్ క్రియేట్ చేస్తుంది. ఈ విడుదలైన మూడు రోజుల్లోనే దాదాపు రూ.20 కోట్లకు పైగా వసూల్ చేసినట్టు తెలుస్తుంది.
