Allu Aravind: సనాతన ధర్మం గురించి పవన్ కే బాగా తెలుసు.. అల్లు అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Allu Aravind: టాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో అల్లు అరవింద్ ఒకరు. ఈయన గీత ఆర్ట్స్ బ్యానర్ పై ఎన్నో అద్భుతమైన సినిమాలను నిర్మించారు అయితే తాజాగా అల్లు అరవింద్ మహావతార్ నరసింహ సినిమాని తెలుగులో విడుదల చేసిన సంగతి తెలిసిందే అయితే ఈ సినిమా మాత్రం కాసుల వర్షం కురిపిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా వందల కోట్ల కలెక్షన్లను రాబట్టి సంచలనాలను సృష్టించింది ఇక తెలుగులో ఈ సినిమాకు అల్లు అరవింద్ విడుదల చేసిన నేపథ్యంలో మంచి లాభాలను సొంతం చేసుకున్నారు.

ఈ సినిమా తెలుగులో మంచి ఆదరణ పొందిన నేపథ్యంలో చిత్రబృందం ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా అల్లు అరవింద్ సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ సినిమాలో నరసింహస్వామి అవతారాల గురించి సనాతన ధర్మం గురించి ఎంతో గొప్పగా చెప్పబడింది ఈ క్రమంలోనే అల్లు అర్జున్ మాట్లాడుతూ సనాతన ధర్మం గురించి మా కుటుంబంలో పవన్ కళ్యాణ్ కు తెలిసిన అంత అద్భుతంగా మరెవరికి తెలియదని తెలిపారు.

పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ ఉంటే ఆయన చెప్పే మాటలు వింటే ఎవరైనా కూడా మంత్రముగ్ధులు అవ్వాల్సిందే. ఇలా సనాతన ధర్మం గురించి ఎంతో తెలిసిన పవన్ కళ్యాణ్ తప్పకుండా మహావతార నరసింహ సినిమా చూడాలని ఈ సందర్భంగా అల్లు అరవింద్ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇక అల్లు అరవింద్ ఒకవైపు నిర్మాతగా కొనసాగుతూనే మరోవైపు ఇలా సినిమాలను విడుదల చేస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్ కూడా ఒకవైపు రాజకీయ వ్యవహారాలు చూస్తూనే మరోవైపు ఈయన కమిట్ అయిన సినిమాలను కూడా పూర్తి చేసే పనిలో పడ్డారు ఇప్పటికే పవన్ నటించిన హరిహర వీరమల్లు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది అయితే ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయిందని చెప్పాలి.