తాజాగా సెక్స్ వర్కర్ల విషయంలో మద్రాస్ హైకోర్టు మరో కీలక వ్యాఖ్యలు చేసింది. పోలీసులు వ్యభిచార గృహాలపై దాడి చేసేటప్పుడు అక్కడున్న సెక్స్ వర్కర్ లతో పాటు విటులను అరెస్టు చేయకూడదు అని.. అలా చేయడం సరికాదని తెలిపింది.
అంతేకాకుండా అది ఒక వృత్తి అని.. వ్యభిచార గృహం నడపడం మాత్రమే చట్ట విరుద్ధం కి వస్తుంది అని తెలిపింది. ఇక ఇటీవలే ఓ విటుడు పై వ్యభిచారం కేసు నమోదు కాగా.. ఆ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను కోర్టు కొట్టేసింది. ఇక ఈ తీర్పు గురించి జనాలు నానా రకాలుగా మాట్లాడుకుంటున్నారు.