చాలా ఏళ్ళ తర్వాత తనకు ఎలాంటి సినిమాలు సూట్ అవుతాయో తెలుసుకున్న హీరో నితిన్ లవ్ స్టోరీస్ తో కొన్ని వరుస హిట్స్ సాధించాడు. కానీ తనకు ఎప్పటినుండో మాస్ హీరో ఇమేజ్ సాధించాలన్న కోరిక ఇంకా తీరినట్టు లేదు.
‘భీష్మ’ లాంటి హిట్ తర్వాత ‘రంగ్ డే’, ‘మాస్ట్రో’ లాంటి సినిమాలతో పర్వాలేదనిపించినా…ఈ సారి ఎలాగైనా మాస్ హీరో ఇమేజ్ అనిపించుకోవాలని ‘మాచర్ల నిజయోజకవర్గం’ అనే మాస్ మసాలా సినిమాతో ముందుకొచ్చాడు, కానీ రిసల్ట్ మాత్రం అదే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా భారీ ప్లాప్ అయ్యింది.
ఇప్పటికే థియేటర్ లో జనాలు ఎవ్వరు రావట్లేదు. ఈ సినిమాని ఇప్పుడు ఓటిటి లో విడుదల చెయ్యడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం, ఈ అమేజాన్ ప్రైమ్ వారు ఈ సినిమా ఓటిటి రైట్స్ తీసుకున్నారు. సెప్టెంటబర్ 9న ఈ చిత్రం ఓటిటి లో రిలీజ్ కానుందని తెలుస్తోంది. రిలీజైన నాలుగు వారాల్లో ఓటిటిలో వస్తోంది. మరి ఓటిటిలో ఈ చిత్రాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాల్సి ఉంది. ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్‌గా నటించింది.