జీవితను దెబ్బకొట్టడానికే ఆమెను రంగంలోకి దింపారా ?

Maa elections become more tough
Maa elections become more tough
మా అధ్యక్ష పదవికి జరుగుతున్న ఎన్నికలు హోరాహోరీగా మారేలా కనబడుతున్నాయి. సెప్టెంబర్ నెలలో ఎన్నికలు జరగనుండగా పోటీదారులు ఒక్కొక్కరు తెర మీదకు వస్తూ ఆసక్తిని రేకెత్తిస్తున్నారు.  ఇప్పటికే ప్రకాష్ రాజ్ పోటీకి సిద్ధమవగా మంచు విష్ణు సైతం సై అంటున్నారు. ఇక వీరి మధ్యలోకి జీవితా రాజశేఖర్ దిగి పోటీని మరింత టైట్ చేశారు.  జీవితను ఇండస్ట్రీలో మంచి కాంటాక్ట్స్ ఉన్నాయి.  అందుకే ఆమె పోటీలోకి దిగడంతో అందరిలోనూ ఆసక్తి ఏర్పడింది. ఎందుకంటే ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవితలు మాత్రమే పోటీలో ఉంటే జీవితకు కలిసొచ్చే అంశాలు ఉన్నాయి.  
 
అయితే ఇప్పుడు నటి హేమ కూడ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ప్రకటన చేశారు.  దీంతో జీవితకు ఉన్న బెనిఫిట్స్దేదెబ్బతినే అవకాశం ఉంది. అసలు జీవితకు ఉండే ఎడ్జ్ లేకుండా చేయడానికి కావాలనే హేమను రంగంలోకి దింపారనే టాక్ కూడ ఉంది. హేమ ఎన్నికల్లో గెకవలేకపోవచ్చు కానీ జీవితకు అనుకూలంగా ఉండే వర్గంలో చీలిక తేగలేదు. అందుకే ఉన్నపళంగా ఆమెను పోటీలో నిలబెట్టారనే మాటలు వినిపిస్తున్నాయి. దీన్నిబట్టి ఎన్నికల నాటికి హేమ లాంటి ప్రత్యామ్నాయాలు చాలానే పుట్టుకొచ్చేలా కనిపిస్తున్నాయి.  ఇండస్ట్రీ పెద్దలు సైతం ఈ ఎన్నికలను తీవ్రంగానే తీసుకున్నారని, తమ అనుకూల వ్యక్తులను గెలిపించడానికి గట్టిగానే పథక రచన చేస్తున్నారని అర్థవుతోంది.