ఈ నెల 16న చంద్రగ్రహణం… ఈ 3 రాశుల వారికి పట్టిందల్లా బంగారం?

సాధారణంగా ప్రతి అమావాస్య పౌర్ణమిలకు సూర్య చంద్ర గ్రహణాలు రావడం సర్వసాధారణం. ఈ క్రమంలోనే ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం ఈనెల 16వ తేదీ రానుంది. అయితే చంద్ర గ్రహణం మనదేశంలో కనిపించదు.ఇకపోతే ఈ విధంగా గ్రహణం ఏర్పడే సమయంలో గ్రహాల మార్పుల కారణంగా కొన్ని రాశుల వారికి శుభం కలగగా మరికొన్ని రాశుల వారికి ఇబ్బందులు ఏర్పడే పరిస్థితులు ఉంటాయి. ఈ క్రమంలోనే ఈ నెల 16వ తేదీ చంద్రగ్రహణం ఏర్పడటంతో గ్రహణ సమయంలో చంద్రుడు వృశ్చిక రాశిలో ఉంటాడు. అదే సమయంలో కుంభ రాశిలో శని కుజుడు ఇద్దరూ ఉంటారు.

ఈ క్రమంలోనే ఈ చంద్రగ్రహణం రోజున మూడు రాశుల వారికి ఎంతో అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. మరి ఆ మూడు రాశుల వారు ఎవరు అనే విషయానికి వస్తే…

మేష రాశి: ఈ చంద్రగ్రహణం మేష రాశి వారికి ఇది ఎంతో అనుకూలంగా ఉంది. చంద్రగ్రహణం రోజు మేష రాశి వారు ఏవైనా పెట్టుబడులు పెట్టాలనుకుంటే, పెట్టుబడులు పెట్టడానికి ఎంతో అనువైన సమయం అని చెప్పాలి. ఇక ఈ రాశి వారు చేపట్టిన శుభకార్యాలలో జీవిత భాగస్వామి మద్దతు ఎంతగానో ఉంటుంది. ఎప్పటి నుంచో వివాదంలో ఉన్నటువంటి కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి.

సింహరాశి: సింహ రాశి వారికి ఈ చంద్రగ్రహణం శుభ ఫలితాలను తీసుకువస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్లు వస్తాయి. వైవాహిక జీవితంలో ఉన్న ఒడిదుడుకులు తొలగిపోతాయి. అలాగే వివాహం కాని వారికి వివాహం కుదిరినది అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ధనస్సు రాశి: ధనస్సు రాశి వారికి చంద్రగ్రహణం ఎంతో శుభసూచకంగా ఉంది అనుకోని విధంగా ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఇక వ్యాపారాలలో మంచి లాభాలను అందుకుంటారు. ఉద్యోగులకు ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.ఇక ఈ రాశి వారికి కొత్తగా ఏదైనా పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే ఇది ఎంతో అనువైన సమయం అని చెప్పాలి.