నాగచైతన్య ‘లవ్ స్టోరీ’: తొలి రోజు వసూళ్ళ ప్రభంజనం

Love Story Tremendous Opening Day | Telugu Rajyam

అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన ‘లవ్ స్టోరీ’ సినిమా తొలి రోజు వసూళ్ళ ప్రభంజనమే సృష్టించింది. మరీ ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్‌కి కొత్త కళ తెచ్చింది ‘లవ్ స్టోరీ’ చాన్నాళ్ళ తర్వాత. కరోనా పాండమిక్ ప్రపంచ వ్యాప్తంగా ఉధృతంగా వున్న నేపథ్యంలో, థియేటర్లలో సినిమా ఎలా ఆడుతుంది.? అన్న అనుమానాలు చాలా మందిలో వున్నాయి. మరీ ముఖ్యంగా అమెరికాలో కేసుల తీవ్రత ఎక్కువగా వున్న దరిమిలా, ఓవర్సీస్ మార్కెట్ మీద టాలీవుడ్ దాదాపుగా ఆశలు వదిలేసుకుంది. ఇలాంటి సమయంలో ‘లవ్ స్టోరీ’ సినిమా తొలి రోజు మంచి వసూళ్ళను తెలుగు రాష్ట్రాల్లో సాధించడం, ఓవర్సీస్‌లో ప్రీమియర్స్ పరంగా అద్భుతమైన వసూళ్ళను రాబట్టడంతో ‘లవ్ స్టోరీ’ టీమ్ సూపర్ హ్యాపీగా కనిపిస్తోంది.. మొత్తంగా సినీ పరిశ్రమ ఈ విజయాన్ని ఎంజాయ్ చేస్తోంది.

మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఇలా ఒకరేమిటి.? చాలామంది ‘లవ్ స్టోరీ’ సినిమా ప్రమోషన్ కోసం తమవంతు ప్రయత్నం చేశారు. అవన్నీ ‘లవ్ స్టోరీ’ సినిమాపై హైప్ క్రియేట్ అవడానికీ, తొలి రోజు వసూళ్ళు రావడానికీ కారణమయ్యాయి. కాగా, రెండో రోజు కూడా థియేటర్లు సందడిగానే వున్నాయి. రేపు ఎలాగూ ఆదివారం గనుక, ‘లవ్ స్టోరీ’ వేగానికి బ్రేకులు పడే అవకాశమే లేదు. సోమవారం ‘లవ్ స్టోరీ’ అసలు సంగతేంటో తెలిసిపోతుంది. అయితే, ఈలోగా ‘లవ్ స్టోరీ’ పూర్తి సేఫ్ అయిపోతుందని అంటున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో సాయి పల్లవి కథానాయికగా నటించిన విషయం విదితమే. ‘లవ్ స్టోరీ’ సినిమాతో తెలుగు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల కొత్త కొత్తగా థియేటర్ల ప్రారంభోత్సవాలు జరిగాయి. అదే సమయంలో, పాత థియేటర్లను కొత్తగా మార్చి.. ఇంకోసారి ప్రారంభోత్సవాలు చేయడం గమనార్హం.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles